- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రిటైర్డ్ హెడ్ మాస్టర్ ఇంటికి రూ.15 లక్షల కరెంట్ బిల్..నెట్టింట వైరల్
ఏపీలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ రిటైర్డ్ హోడ్ మాస్టర్ ఇంటికి ఏకంగా రూ.15 లక్షల కరెంట్ బిల్లు వచ్చింది.

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ రిటైర్డ్ హోడ్ మాస్టర్ ఇంటికి ఏకంగా రూ.15 లక్షల కరెంట్ బిల్లు వచ్చింది. ప్రతినెల రూ.1300 వచ్చే కరెంట్ బిల్ 15 లక్షలు రావడంతో ఆయన షాక్ అయ్యారు. ఈ ఘటన కోనసీమ జిల్లా మామిడికుదురు మండలంలో చోటు చేసుకుంది. రిటైర్డ్ హెడ్ మాస్టర్ నన్నేషా హుస్సేన్ ఇంటికి సాధారణంగా ప్రతి నెల రూ.1300 వరకు కరెంట్ బిల్ వస్తుంది. లక్షా అరవై వేల యూనిట్ల విద్యుత్ వినియోగించినట్టు మీటర్ లో చూపించడంతో తాను యాప్ లో చూశానని చెప్పారు.
అందులో బిల్ రూ.15 లక్షలు చూపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. లైన్ మెన్‌ను అడిగితే కొత్త మీటర్‌కు అప్లై చేయాలని దానికోసం డబ్బులు కట్టాలని చెప్పారన్నారు. కానీ తాను ఇప్పటికే తాను మీటర్‌కు డబ్బు కట్టానని మళ్లీ కట్టనని అన్నారు. పాత మీటర్లు ఉన్నప్పుడు సమస్య లేదని డిజిటల్ మీటర్లు వచ్చాక సమస్య మొదలైందన్నారు. ఇలా అయితే సామాన్యులు ఎలా బిల్లు కడతారని ప్రశ్నించారు. లక్షల్లో బిల్లు చూస్తే హార్ట్ ఎటాక్‌లు కూడా వచ్చే ప్రమాదం ఉందని అన్నారు.






