- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Lokesh: గత ప్రభుత్వ నిర్వాకంతో 12లక్షలమంది డ్రాపవుట్స్
గత ప్రభుత్వ నిర్వాకంతో ప్రభుత్వ స్కూళ్లలో 12లక్షలమంది విద్యార్థులు తగ్గిపోయారని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖలమంత్రి నారా లోకేశ్ అన్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: గత ప్రభుత్వ నిర్వాకంతో ప్రభుత్వ స్కూళ్లలో 12లక్షలమంది విద్యార్థులు తగ్గిపోయారని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖలమంత్రి నారా లోకేశ్ (nara lokesh)అన్నారు. 117 జీఓతో (117 GO)నిరుపేద పిల్లలకు విద్యను దూరం చేశారని ఆరోపించారు. శాసన సభలో (ap assembly) ఈ రోజు పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తిస్థాయి ప్రహరీ నిర్మాణానికి 3వేలకోట్లు అవసరం అన్నారు. ఉపాధి హామీ, మన బడి మన భవిష్యత్తు నిధుల కన్వర్జెన్స్ తో దశలవారీగా ప్రహరీ నిర్మాణం చేపడతామని తెలిపారు. ఇటీవల మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో పాఠశాలల్లో ఇన్ ఫ్రాస్ట్రక్చర్, అవుట్ కమ్స్ పై స్టార్ రేటింగ్ ఇచ్చాం అన్నారు. కనీస మౌలిక సదుపాయాలు లేని 1,2 స్టార్ రేటింగ్ పాఠశాలలల్లో లీక్ ప్రూఫ్ భవనాలు, బెంచిలు, టాయ్ లెట్లు, తాగునీరు వంటి కనీస మౌలిక సదుపాయాలపై దృష్టిపెట్టామని తెలిపారు. 117 జీవోకు ప్రత్యామ్నాయంపై ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయ సంఘాలతో చర్చిస్తున్నాం అన్నారు. నాడు-నేడులో అసంపూర్తిగా మిగిలిపోయిన పనులకు సంబంధించి వివరాలు సేకరించి, వాటిని పూర్తిచేస్తామని ఆయన తెలిపారు.117 ప్రత్యామ్నయంపై చర్చించిన తర్వాత టీచర్ ట్రాన్స్ఫర్స్, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తామని లోకేశ్ తెలిపారు.
గత ప్రభుత్వం చేపట్టిన నాడు – నేడు (nadu, nedu) పనులపై అనేక ఆరోపణలు వచ్చాయి, నాడు-నేడు అవతకవకలపై నివేదిక తెప్పించుకుని, సభ్యులతో చర్చించిన తర్వాత చర్యలు తీసుకుంటామన్నారు. రంపచోడవరం నియోజకవర్గంలో 80పాఠశాలల్లో ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అవసరం ఉందన్నారు. ఇక్కడ ప్రత్యేక పథకం ద్వారా మౌలిక సదుపాయాలు పూర్తిచేస్తాం. కేజీబీవీలకు సంబంధించి నూరుశాతం ప్రహరీలను ఈ సంవత్సరం డిసెంబర్ లోగా పూర్తిచేస్తాం. రాబోయే 3నెలల్లో సీసీటీవీ, లైటింగ్ ఏర్పాటుచేస్తాం. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వంతోపాటు సభ్యులంతా బాగస్వాములు కావాలన్నారు. పాఠశాలలకు స్టార్ రేటింగ్ తోపాటు లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ (లీప్) ప్రోగ్రామ్ లో సంస్కరణలు తెస్తున్నామని వెల్లడించారు. రాబోయే అయిదేళ్లలో ప్రభుత్వ స్కూళ్లలో పూర్తిస్థాయి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి నారా లోకేష్ చెప్పారు. డ్రగ్స్ నివారణకు చేపడుతున్న చర్యలపై లోకేష్ సమాధానమిస్తూ... డ్రగ్స్ వద్దు బ్రో (drugs) అనే క్యాంపెయిన్ చేపడుతున్నాం. గంజాయి కారణంగా ఒక తరం ఎలా నాశనమవుతుందో తెలియజెప్పి, విద్యార్థుల్లో చైతన్యం కలిగించేందుకు ప్రతిపాఠశాలలో ఈగల్ క్లబ్స్ ఏర్పాటుచేస్తున్నాం. వీటిని రాష్ట్రవ్యాప్తంగా అన్నిపాఠశాలలు, కాలేజిల్లో ఏర్పాటు చేస్తాం. పదోతరగతి, ఇంటర్ పరీక్షల తర్వాత ఈ క్లబ్బులను యాక్టివేట్ చేస్తామని అన్నారు.






