- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ambati : 11సీట్లపై మాకు..164పై వాళ్లకు అయోమయమే : అంబటి
ఏపీ అసెంబ్లీ ఎన్నిక()AP Assembly Elections)ల్లో మళ్లీ వైసీపీ(YCP) అధికారంలోకి వస్తుందని..జగన్(YS. Jagan) మరోసారి సీఎం(CM) అవుతారని అనుకున్నామని..కానీ ఇంత ఘోరంగా ఓడిపోతామని అనుకోలేదని ఆ పార్టీ ముఖ్యనేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ అసెంబ్లీ ఎన్నిక()AP Assembly Elections)ల్లో మళ్లీ వైసీపీ(YCP) అధికారంలోకి వస్తుందని..జగన్(YS. Jagan) మరోసారి సీఎం(CM) అవుతారని అనుకున్నామని..కానీ ఇంత ఘోరంగా ఓడిపోతామని అనుకోలేదని ఆ పార్టీ ముఖ్యనేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసలు ఎన్నికల్లో మాకు 11 సీట్లు మాత్రమే ఎందుకు వచ్చాయో మాకు అర్థం కావడం లేదని(Don't Understand)...అలాగే కూటమికి 164 సీట్లు ఎందుకు వచ్చాయో వాళ్లకు కూడా అర్థం కావడం లేదని అంబటి కామెంట్ చేశారు. అంటే ఏం జరిగిందో అర్ధం కావడం లేదన్నారు. మూడు పార్టీలు జత కట్టడంతో వారి బలం పెరిగిందా లేక..మనకు తెలియని వ్యతిరేకత మనపై ఉందా..ఇంకేమైనా మాయా జరిగిందా అన్న అనుమానాలు మా మనసుల్లో కోకొల్లలుగా ఉన్నాయన్నారు.
అనకాపల్లి జిల్లా కశింకోటలో వైసీపీ అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జీగా మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్య్రమానికి ఎమ్మెల్సీలు బొత్స సత్యనారాయణ, వరుదు కల్యాణీతో పాటున అంబటి రాంబుబు హాజరయ్యారు. ఈ సందర్భంగా అంబటి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. జగన్‌మోహన్‌రెడ్డి మరోమారు ముఖ్యమంత్రి అవుతారని అనుకున్నామని, కానీ ఘోరంగా ఓడిపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చాయని, ఓటమని అంగీకరించాల్సిందేనని చెప్పారు. ఏది ఏమైనా ఓడిపోయామని అన్నారు. పంట సరిగా పండలేదని..తిరిగి వ్యవసాయం చేయాలన్నారు. పార్టీ పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగానే కరణం ధర్మశ్రీని జగన్ అనకాపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జ్‌గా నియమించారని అంబటి పేర్కొన్నారు. నాయకులు, కార్యకర్తల మధ్య విబేధాలు ఉంటే పక్కన పెట్టాలని సూచించారు.
అంబటి చేసిన తాజా వ్యాఖ్యలను చూస్తే అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఓటమిపై వైసీసీ నాయకత్వం ఇంకా తేరుకోలేదని..ముఖ్యంగా ఘోర ఓటమి ఎందుకు ఎదురైందన్న దానిపై నేటికి స్పష్టత తెచ్చుకోలేకపోతున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఓటమి కారణాలపై గందరగోళం పార్టీ అధినేత వైఎస్ .జగన్ నుంచి కేడర్ వరకు కొనసాగుతుందని..రాజకీయ పార్టీగా ఎన్నికల ఫలితాలను త్వరగా విశ్లేషించుకుని తిరిగి పుంజుకునే వ్యూహాలపై ఫోకస్ పెట్టాలని వారు సూచిస్తు్న్నారు.






