ఏపీలో నేటి నుంచి ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు..ఈ రూల్స్ పాటించాల్సిందే

by velandi.Saikiran |

నేటి నుంచి ఏపీలో 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ ఒకటో తేదీ వరకు ఈ పదో తరగతి పరీక్షలు పూర్తి కానున్నాయి.

ఏపీలో నేటి నుంచి ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు..ఈ రూల్స్ పాటించాల్సిందే
X

దిశ‌, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పదో తరగతి విద్యార్థులకు అలర్ట్. నేటి నుంచి ఏపీలో 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. సోమవారం నుంచి ఏప్రిల్ ఒకటో తేదీ వరకు దాదాపు 15 రోజుల వ్యవధిలో ఈ పదో తరగతి పరీక్షలు పూర్తి కానున్నాయి. ఇప్పటికే తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కాగా, నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో కూడా షురూ కాబోతున్నాయి. ఈ మేరకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు అధికారులు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12: 45 గంటల వరకు పరీక్ష ఉంటుంది. ఒక పరీక్షకు మూడు గంటల 15 నిమిషాల సమయం ఉండనుంది. ఈ సంవత్సరం 6,40,916 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయబోతున్నారు. ప్రత్యేక పరిస్థితులలో మాత్రమే 10 గంటల వరకు మాత్రమే పరీక్షకు అనుమతి ఇస్తారు.

కచ్చితంగా ఈ రూల్స్ పాటించాల్సిందే

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పదో తరగతి విద్యార్థులు పరీక్ష రాసే ముందు ఓఎంఆర్ షీట్ పైన ఫోటో, పేరు, నెంబరు కచ్చితంగా చూసుకోవాలి. తప్పులు దొర్లితే, వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలి. 24 పేజీల బుక్ లేట్ లో జవాబులు రాసిన తర్వాత, అవసరం అయితే మరో 12 పేజీల బుక్లెట్ కూడా ఇచ్చే అవకాశాలు కల్పించారు. బ్లూ, బ్లాక్ పాయింట్ పెన్నులకు అనుమతి ఉంటుంది. ఇక విద్యార్థులు హాల్ టికెట్ చూయించి ఏపీలోని ఏ మూలనైనా ఆర్టీసీ బస్సులలో పరీక్షా కేంద్రాలకు ఉచితంగానే ప్రయాణించవచ్చు. కాగా ఈ పదో త‌ర‌గ‌తి పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ జరగకుండా 156 ఫ్లయింగ్ స్క్వాడ్ లను ఏర్పాటు చేశారు. 33,822 మంది టీచర్లను ఇన్విజిలేటర్లుగా నియామకం చేశారు. 3415 ప‌రీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.

Next Story