- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మొంథా ఎఫెక్ట్: 107 రైళ్ల రద్దు.. వివరాలివే
మొంథా తీవ్ర తుపాను ప్రభావం నేపథ్యంలో ఏపీలో కోస్తా జిల్లాలకు వెళ్లే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

దిశ, వెబ్డెస్క్: మొంథా తీవ్ర తుపాను ప్రభావం నేపథ్యంలో ఏపీలో కోస్తా జిల్లాలకు వెళ్లే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. మంగళ, బుధవారాల్లో మొత్తం 107 రైళ్ల సర్వీసుల్ని రద్దు చేసినట్లు ప్రకటించింది. మంగళవారం 70, బుధవారం 36, గురువారం 1 రైలును రద్దు చేసింది. హైదరాబాద్, చెన్నై, భువనేశ్వర్, విజయవాడ, రాజమండ్రి, వైజాగ్, గుంటూరు, కాకినాడ, తెనాలి, రేపల్లె, మార్కాపురం, మచిలీపట్నం, నర్సాపురం, నిడదవోలు, భీమవరం, ఒంగోలు, మాచర్ల నుంచి బయల్దేరే రైళ్లను రద్దు చేసిన అధికారులు, 6 రైళ్లను దారి మళ్లించినట్లు, మరో 18 రైళ్ల సమయాల్లో మార్పులు చేసినట్లు తెలిపారు. రద్దయిన రైళ్ల వివరాలను అధికారిక వెబ్ సైట్ లో ఉంచారు. క్యాన్సిల్ అయిన రైళ్లకు రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులకు టికెట్ మొత్తం ధరను రైల్వేశాఖ తిరిగి చెల్లించనుంది.
ప్రయాణికులకు వివరాలు, మరింత సమాచారం అందించేందుకు హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేసింది. విజయవాడ- 0866-2575167, నెల్లూరు- 9063347961, ఒంగోలు- 7815909489, బాపట్ల- 7815909329, తెనాలి- 7815909463, ఏలూరు- 7569305268, రాజమహేంద్రవరం- 8331987657, సామర్లకోట- 7382383188, తుని- 7815909479, అనకాపల్లి- 7569305669, భీమవరం- 7815909402, గుడివాడ- 7815909462
మరోవైపు మొంథా తుపాను గంటగంటకు తీరానికి చేరువవుతోంది. మచిలీపట్నంకు 160, కాకినాడకు 240, వైజాగ్ కు 320 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు APSDMA తెలిపింది. అధికారులు నిజాంపట్నం హార్బర్ లో 7వ నంబర్, కాకినాడ పోర్టులో 10వ నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.






