శ్రీశైలం హైవేపై 10 కిమీల మేర ట్రాఫిక్ జాం

by Muthe.Rajitha |

శ్రీశైలం(Srishailam) రోడ్డులో భారీగా ట్రాఫిక్ జాం(Heavy Traffic Jam) నెలకొంది.

శ్రీశైలం హైవేపై 10 కిమీల మేర ట్రాఫిక్ జాం
X

దిశ, వెబ్ డెస్క్ : శ్రీశైలం(Srishailam) రోడ్డులో భారీగా ట్రాఫిక్ జాం(Heavy Traffic Jam) నెలకొంది. వరుసగా రెండు రోజులు సెలవులు రావడంతో భారీగా భక్తులు శ్రీశైలానికి పోటెత్తారు. దీంతో శ్రీశైలం ఘాటు రోడ్లన్నీ వాహనాలతో నిండిపోయాయి. దాదాపు 10కిమీల మేర ట్రాఫిక్ జాం అవడంతో వాహనదారులు, భక్తులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. అలాగే శ్రీశైలం గేట్లు ఎత్తడంతో డ్యాంను చూడటానికి పర్యాటకులు పోటెత్తారు. అమ్రాబాద్ మండలం పాతాళగంగ నుంచి దోమలపెంటలోని చెక్ పోస్టు వరకు వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోతాయి. కాగా వాహనాల రద్దీని నియంత్రించేందుకు పోలీసులు, అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

Next Story