రాష్ట్రంలో 5 వేల మినీలు అంగన్వాడీలుగా మార్పు : మంత్రి సంధ్యారాణి

by Thanuru Gopichand |   (  Updated:2025-11-24 07:27:28  IST  )

రాష్ట్రంలో 5వేల మినీలను అంగన్వాడీలుగా (Anganwadi) మార్పు చేశామని రాష్ట్ర స్త్రీ, శిశు, గిరిజన సంక్షేమ శాఖల మంత్రి సంధ్యారాణి (Minister Sandhya Rani) తెలిపారు.

రాష్ట్రంలో 5 వేల మినీలు అంగన్వాడీలుగా మార్పు : మంత్రి సంధ్యారాణి
X

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో 5వేల మినీలను అంగన్వాడీలుగా (Anganwadi) మార్పు చేశామని రాష్ట్ర స్త్రీ, శిశు, గిరిజన సంక్షేమ శాఖల మంత్రి సంధ్యారాణి (Minister Sandhya Rani) తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లాలో 217 మందికి అంగన్వాడీ టీచర్లుగా పదోన్నతి కల్పించామని పేర్కొన్నారు. బాల్య వివాహాల నిర్మూలనకు అందరూ కృషి చేయాలని కోరారు. పిల్లల పోషణ, ఆరోగ్యం, ప్రీ స్కూల్ సేవలను బలోపేతం చేస్తున్నామని, అందులో అంగన్వాడీ సిబ్బంది భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో అంగన్వాడీ సేవలను మరింత విస్తరించాలన్నారు. అంగన్వాడీ టీచర్ల వేతనం పెంచి, గ్రాట్యుటీ ఇచ్చిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని స్పష్టం చేశారు. చిన్నారులకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై అవగాహన కల్పించాలన్నారు. చిన్నారులకు పోషకాహారం అందించడంలో ఎటువంటి రాజీ లేదని వెల్లడించారు.

Next Story