- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వ్యక్తిగత హక్కుల భంగంపై కోర్టుకు పవన్, ఎన్టీఆర్.. మే 12కు విచారణ వాయిదా
వ్యక్తిగత హక్కుల భంగంపై ఢిల్లీ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ వాయిదా పడింది..

X
దిశ, వెబ్ డెస్క్: తమ ఫొటోలు, వీడియోలను అనుమతులు లేకుండా వ్యాపార అవసరాల కోసం సోషల్ మీడియాలో వినియోగిస్తున్నారని, తమ వ్యక్తిగత హక్కులను భంగం కలగకుండా చూడాలని సినీ నటులు పవన్ కల్యాణ్, జూనియర్ ఎన్టీఆర్(Film actors Pawan Kalyan and Jr. NTR) ఢిల్లీ హైకోర్టు(Delhi High Court)ను ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే ఈ పిటిషన్లపై సోమవారం మరోసారి ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇప్పటికే ఇచ్చిన ఆదేశాలపై ప్రతివాదులు ఫ్లిప్ కార్ట్, అమెజాన్, గూగుల్, ఎక్స్, ఇన్ స్ట్రామ్(Flipkart, Amazon, Google, X, Instagram)పై కోర్టు ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే కొన్ని లింకులను తొలగించినట్లు కోర్టుకు ఆయా సంస్థలు వివరించారు. దీంతో ఆ లింకులకు సంబంధించిన ఖాతాల బీఎస్ఐ, ఐపీ లాగిన్ వివరాలు మూడు వారాల్లో అందజేయాలని కోర్టు ఆదేశించింది. విచారణను మే 12కు వాయిదా వేసింది.
Next Story






