- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొడుకుని రోడ్డు మీద వదిలి కృష్ణా నదిలో దూకేసింది
<p>ప్రకాశం బ్యారేజీపై నుంచి కృష్ణానదిలో దూకి వివాహిత ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన విజయవాడలో కలకలం రేపింది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే… గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన మహిళ కుటుంబం కలహాల నేపథ్యంలో జీవితంపై విరక్తి చెంది… ఇంటి నుంచి తన రెండేళ్ల కుమారుడిని తీసుకుని ప్రకాశం బ్యారేజీ వద్దకు చేరుకుంది. బ్యారేజీపై పిల్లర్ నెంబర్ 50 వద్దకు చేరుకున్న ఆమె.. కుమారుడ్ని వదిలి అమాతం కృష్ణా నదిలో దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. అక్కడే […]</p>

X
ప్రకాశం బ్యారేజీపై నుంచి కృష్ణానదిలో దూకి వివాహిత ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన విజయవాడలో కలకలం రేపింది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే… గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన మహిళ కుటుంబం కలహాల నేపథ్యంలో జీవితంపై విరక్తి చెంది… ఇంటి నుంచి తన రెండేళ్ల కుమారుడిని తీసుకుని ప్రకాశం బ్యారేజీ వద్దకు చేరుకుంది. బ్యారేజీపై పిల్లర్ నెంబర్ 50 వద్దకు చేరుకున్న ఆమె.. కుమారుడ్ని వదిలి అమాతం కృష్ణా నదిలో దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. అక్కడే పహారాకాస్తున్న పోలీసులు ఆమెను గమనించి వేగంగా స్పదించి, గజఈతగాళ్ల సాయంతో రక్షించి ప్రభుత్వాసుపత్రిలో చేర్చారు. అమెకు ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలపడంతో అంతా హాయిగా ఊపిరిపీల్చుకున్నారు. అనంతరం ఆమె కుటుంబ సభ్యులకు సమాచారమందించారు.
Next Story






