ఆంధ్రాయే టాప్.. తెలంగాణ 19

by Vemula.Srinu Prasad |

<p>కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ఆయుష్మాన్‌ భారత్‌’ పథకం అమలులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రభాగాన నిలిచింది. ఆయుష్మాన్ భారత్ పథకంలో భాగంగా హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ సెంటర్ల నిర్వహణలో ఆంధ్రప్రదేశ్‌ 66 మార్కులు సాధించింది. దీంతో ఏపీ మొదటి ర్యాంక్‌ దక్కించుకుంది. ఈ పథకంలో జన ఆరోగ్య యోజన (ఆరోగ్యశ్రీ తరహా) సేవతో పాటు హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ సెంటర్ల నిర్వహణ రెండోది. గ్రామీణ ప్రాంతాల్లో పేద రోగులకు వైద్యసేవలు అందించడం, వారి వివరాలను నమోదు చేయడం, [&hellip;]</p>

ఆంధ్రాయే టాప్.. తెలంగాణ 19
X

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ఆయుష్మాన్‌ భారత్‌’ పథకం అమలులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రభాగాన నిలిచింది. ఆయుష్మాన్ భారత్ పథకంలో భాగంగా హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ సెంటర్ల నిర్వహణలో ఆంధ్రప్రదేశ్‌ 66 మార్కులు సాధించింది. దీంతో ఏపీ మొదటి ర్యాంక్‌ దక్కించుకుంది. ఈ పథకంలో జన ఆరోగ్య యోజన (ఆరోగ్యశ్రీ తరహా) సేవతో పాటు హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ సెంటర్ల నిర్వహణ రెండోది.

గ్రామీణ ప్రాంతాల్లో పేద రోగులకు వైద్యసేవలు అందించడం, వారి వివరాలను నమోదు చేయడం, వాటిని కేంద్ర ఆరోగ్య శాఖ పోర్టల్‌కు అనుసంధానించడం వంటి విషయాల్లో ఆంధ్రప్రదేశ్‌ మంచి ప్రతిభ కనబరిచినట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి వికాస్‌ షీల్‌ ఆయా రాష్ట్రాలు సాధించిన ర్యాంకుల వివరాలతో పాటు, ఈ విభాగంలో కనబరిచిన పనితనాన్ని వివరిస్తూ అన్ని రాష్ట్రాలకు లేఖలు రాశారు.

2019 డిసెంబర్, 2020 జనవరి నెలల కాలంలో ఆయా రాష్ట్రాలు ప్రదర్శించిన ప్రతిభను గణించారు. ఆ గణాంకాల ఆధారంగా ర్యాంకులు కేటాయించారు. ఈ ర్యాంకుల్లో 66 మార్కులతో ఆంధ్రప్రదేశ్ ప్రధమ స్థానంలో నిలిచిందని తెలిపారు. 58 మార్కులతో గోవా, తమిళనాడు రాష్ట్రాలు సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచినట్టు వెల్లడించారు, 57 మార్కులతో గుజరాత్‌ మూడో స్థానంలో నిలిచిందని చెప్పారు. మరో తెలుగు రాష్ట్రం తెలంగాణ 37 మార్కులతో 19వ స్థానంలో నిలిచిందని ఆయన ఆ లేఖలో తెలిపారు. కాగా, ఆయుష్మాన్ భారత్ పథకానికి నిధులను కేంద్రమే విడుదల చేస్తుంది.

Next Story