- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- వైరల్
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- టెక్నాలజీ
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- రాశిఫలాలు
- ఫోటోలు
- ఆరోగ్యం
దిశ, వెబ్‌డెస్క్: బుల్లితెర హాట్ యాంకర్, నటి అనసూయ వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఒక పక్క ఐటెం సాంగ్స్ తో, మరోపక్క క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్టార్ హీరోల సినిమాలలో నటిస్తూ రచ్చ లేపుతోంది. ప్రస్తుతం అనసూయ, అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న పుష్ప లో నటిస్తోంది. ఈ చిత్రంలో అనసూయ పాత్ర చాలా కీలకంగా ఉండబోతుందని మేకర్స్ తెలిపిన విషయం విదితమే.. ఇక తాజాగా అనసూయ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ లో పెట్టిన పోస్ట్ సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఆ బూమ్ రాంగ్ వీడియోలో జైలు సీన్లకు సంబంధించిన షూటింగ్ జరుగుతున్నట్టు కనిపిస్తోంది. అందులో తాను కనిపించకపోయినా.. జైల్లో ఉన్నట్టుగా సింబాలిక్‌గా చూపించింది. అంతేకాకుండా ‘వాంటెడ్’ అంటూ హింట్ కూడా ఇచ్చింది. అయితే ఈ షూటింగ్ ఖచ్చితంగా ‘పుష్ప’దే అయ్యి ఉంటుందని నెటిజెన్లు అంటున్నారు. ప్రస్తుతం పుష్ప యూనిట్ మారెడుమిల్లి అటవీ ప్రాంతంలో ఉందన్న సంగతి తెలిసిందే. ఇటీవల అనసూయ కూడా ఈ షూటింగ్ లోనే పాల్గొన్న విషయం తెలిసిందే. దీంతో ఈ జైలు సీన్స్ కూడా అందులోవే అని అభిప్రాయపడుతున్నారు. మరి ఈ సీక్వెన్స్ ‘పుష్ప’ సినిమాలోనిదేనా? మరేతర సినిమా కోసమైనా ఇలాంటి పాత్ర చేస్తుందా? అన్నది తెలియాలి.
కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్సైట్లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.