- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్రేకింగ్.. యాంకర్ అనసూయ ఇంట విషాదం
<p>దిశ, వెబ్‌డెస్క్ : జబర్దస్త్ యాంకర్, సినీనటి అనసూయ భరద్వాజ్ ఇంట విషాద ఘటన చోటుచేసుకుంది. అనసూయ తండ్రి సుదర్శన్ రావు కస్బా(63) అనారోగ్యంతో ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. అయితే.. సుదర్శన్ రావు కొంత కాలం నుంచి క్యాన్స్‌ర్ వ్యాధితో బాధపడుతున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే చికిత్స పొందుతూ తార్నాకలోని ఆయన నివాసంలో సుదర్శన్ రావు కన్నుమూసినట్టు సమాచారం. సుదర్శన్ రావు మృతితో అనసూయ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ విషయం తెలిసిన సినీ ప్రముఖులు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : జబర్దస్త్ యాంకర్, సినీనటి అనసూయ భరద్వాజ్ ఇంట విషాద ఘటన చోటుచేసుకుంది. అనసూయ తండ్రి సుదర్శన్ రావు కస్బా(63) అనారోగ్యంతో ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. అయితే.. సుదర్శన్ రావు కొంత కాలం నుంచి క్యాన్స్‌ర్ వ్యాధితో బాధపడుతున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే చికిత్స పొందుతూ తార్నాకలోని ఆయన నివాసంలో సుదర్శన్ రావు కన్నుమూసినట్టు సమాచారం. సుదర్శన్ రావు మృతితో అనసూయ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ విషయం తెలిసిన సినీ ప్రముఖులు అనసూయ కుటుంబానికి సానుభూతి తెలుపుతున్నారు. అయితే.. సుదర్శన్ రావు చాలాకాలం పాటు కాంగ్రెస్ పార్టీలో పని చేశారు.
ఇదిలా ఉండగా యాంకర్ అనసూయ పుష్ప సినిమాలో కీ రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే. ఆమె పిక్‌ను చిత్ర యూనిట్ అఫీషియల్‌గా రిలీజ్ చేయడంతో ఆ ఫోటో వైరల్‌గా మారింది.
Next Story






