- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అనసూయకు సోషల్ మీడియా హెడేక్
<p>జబర్దస్త్ షోతో ఫేమస్ అయిన అనసూయ భరద్వాజ్ అటు సినిమాల్లోను నటిస్తోంది. అయితే ఈ మధ్య సోషల్ మీడియాతో చాలా సమస్యలే ఎదుర్కొంటోంది అనసూయ. ఎప్పుడూ ఎవరో ఒకరు కామెంట్ చేయడం.. దానికి అనసూయ చాలా కోపంగా సమాధానం చెప్పడం. అనసూయ ఆగ్రహానికి డోస్ పెంచడంతో నెటిజన్ల కామెంట్ల డోస్ పెరిగింది. నీచమైన, అసభ్యమైన పదజాలంతో ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులను ట్యాగ్ చేసిన అనసూయ వారిపై యాక్షన్ తీసుకోవాలని కోరింది. దీనిపై […]</p>

జబర్దస్త్ షోతో ఫేమస్ అయిన అనసూయ భరద్వాజ్ అటు సినిమాల్లోను నటిస్తోంది. అయితే ఈ మధ్య సోషల్ మీడియాతో చాలా సమస్యలే ఎదుర్కొంటోంది అనసూయ. ఎప్పుడూ ఎవరో ఒకరు కామెంట్ చేయడం.. దానికి అనసూయ చాలా కోపంగా సమాధానం చెప్పడం. అనసూయ ఆగ్రహానికి డోస్ పెంచడంతో నెటిజన్ల కామెంట్ల డోస్ పెరిగింది. నీచమైన, అసభ్యమైన పదజాలంతో ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులను ట్యాగ్ చేసిన అనసూయ వారిపై యాక్షన్ తీసుకోవాలని కోరింది. దీనిపై వెంటనే స్పందించారు పోలీసులు. ఇలాంటి ట్రోల్స్ చేస్తున్నవారిని పట్టుకుని బుద్ధిచెప్తామని హామీ ఇచ్చారు.
దీనిపై మరో నెటిజన్ కామెంట్ చేశాడు. ఇలాంటి ఎకౌంట్స్ ఉంటాయని అనసూయకు ఇప్పుడే తెలిసిందా అనడంతో ‘ లేదమ్మా.. ముందే తెలుసు.. కానీ మనిషన్నాక ఎప్పుడో ఒకప్పుడు తప్పు తెలుసుకుంటారులే అనుకున్నా, కానీ నేను మనిషినే కదా ఏదో ఒక పాయింట్‌లో నాకు ఓపిక నశిస్తుంది కదా… అందుకే పోలీసులకు ఫిర్యాదు చేశా ‘ అని ఆన్సర్ ఇచ్చింది.






