కార్తికేయతో యాంకర్ మాస్ డ్యాన్స్.. పిక్స్ వైరల్

by  |
కార్తికేయతో యాంకర్ మాస్ డ్యాన్స్.. పిక్స్ వైరల్
X

దిశ, సినిమా : అనసూయ భరద్వాజ్.. అభిమానులకు ‘చావు కబురు చల్లగా’ టీమ్ చల్లటి కబురు అందించింది. ఈ జబర్ధస్త్ యాంకర్.. హీరో కార్తికేయతో కలిసి మాస్ డ్యాన్స్ నంబర్‌లో దుమ్ములేపే స్టెప్స్ వేసినట్లు అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ఇందుకు సంబంధించిన పిక్స్ కూడా షేర్ చేసిన మూవీ యూనిట్, థియేటర్స్‌లో విజిల్స్ కొట్టేందుకు రెడీ అయిపోమని చెప్తోంది. అనసూయ హార్మోనియం వాయిస్తున్న ఫొటోలతో పాటు కంజర పట్టుకుని పాట పాడుతున్న పిక్స్ ‘రాజా హిందుస్థానీ’లో పరదేశీ సాంగ్‌ను గుర్తుచేస్తుండగా.. సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి మరి. కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వంలో వస్తున్న సినిమాలో లావణ్య త్రిపాఠి హీరోయిన్ కాగా, జాక్స్ బెజోయ్ సంగీతం అందిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 19న థియేటర్స్‌లోకి రానుంది.


Next Story

Most Viewed