ఆ అవకాశం వస్తే అస్సలు వదులుకోను : అనసూయ

95

దిశ, సినిమా: జబర్దస్త్ యాంకర్ అనసూయ భరద్వాజ్ యాక్ట్రెస్‌గానూ బిజీ అయిపోయింది. ‘రంగస్థలం’లో రంగమ్మత్తగా అదిరిపోయే పర్‌ఫార్మెన్స్ ఇచ్చిన బ్యూటీ.. ఆ తర్వాత చాలా సినిమాలే చేసినా గుర్తిండిపోయే పాత్రలు దక్కలేదు. కాగా ‘రంగస్థలం’ డైరెక్టర్ సుకుమార్ నుంచి వస్తున్న ‘పుష్ప’ సినిమాలో మరో హాట్ రోల్ చేయనుందనే న్యూస్ ఫిల్మ్ నగర్ వర్గాల్లో చక్కర్లు కొట్టింది. అయితే తాను ‘పుష్ప’లో నటించడం లేదని క్లారిటీ ఇచ్చిన అనసూయ.. ఇందుకోసం తనను ఎవరూ సంప్రదించలేదని, ఒకవేళ అంత ఇంపార్టెన్స్ ఉన్న రోల్ అయితే వదులుకోనని తెలిపింది. బాలీవుడ్, కోలీవుడ్ దర్శక నిర్మాతలు సైతం తనను సంప్రదిస్తున్నారని, అయితే ఎన్ని అవకాశాలు వచ్చినా బుల్లితెరను మాత్రం వదలనని చెప్పింది. అభిమానులకు ఏదైనా డౌట్ ఉంటే తనను నేరుగా అడగొచ్చని, ఎవరో రాసినదాన్ని గుడ్డిగా నమ్మకూడదని సూచించింది.

కాగా ఈ మధ్య ‘చావు కబురు చల్లగా’ సినిమాలో ఐటెం సాంగ్ ప్లే చేసిన అనసూయకు నెటిజన్ల నుంచి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఐటెమ్ సాంగ్ చేయనన్నారు కదా? మళ్లీ ఎందుకు చేశారని ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘ప్రత్యేకంగా మూవీలో ఐటెం సాంగ్ అనేది ఉండదు. ఒకప్పుడు అమ్మాయిని వస్తువులా ట్రీట్ చేసేవాళ్లు ఇచ్చిన పేరు అది, కేవలం లిరిక్స్ వల్లే ఈ స్పెషల్ సాంగ్‌కు ఒప్పుకున్నా’ అని తెలిపింది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..