హీరోయిన్ అనన్య పాండే, ఆర్యన్ మధ్య డ్రగ్స్ చాట్.. జోక్ అంటున్న నటి

228

దిశ, సినిమా : బాలీవుడ్ నటుడు షారుక్‌ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసుతో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న హీరోయిన్‌ అనన్య పాండే NCB ఎదుట హాజరైంది. గురువారం హీరోయిన్ ఇంట్లో సోదాలు నిర్వహించిన ఎన్సీబీ అధికారులు ఆమె ఫోన్‌, ల్యాప్‌టాప్‌ను సీజ్‌ చేసిన విషయం తెలిసిందే. విచారణలో భాగంగా ఆర్యన్‌తో ఫ్రెండ్‌షిప్ గురించి ప్రశ్నించగా.. తన‌తో ఎప్పుడూ తమాషాగా ఉంటానని, డ్రగ్స్ గురించి కూడా జోక్ చేశానని చెప్పినట్లు తెలిపారు అధికారులు.

దాదాపు రెండు గంటపాటు జరిగిన ఇంటరాగేషన్‌లో అనన్యను ప్రశ్నించిన అధికారులు ఆర్యన్‌తో అనన్య వాట్సాప్ చాటింగ్ గురించి ఆరా తీశారు. వీరిద్దరి మధ్య గంజాయి కోసం వాట్సాప్ చర్చ జరిగిందని గుర్తించినట్లు వెల్లడించారు. డ్రగ్స్ కావాలని ఆర్యన్ తనను అడగడంతో ఏర్పాటు చేస్తానని అనన్య చెప్పినట్లు ఆ చాట్‌లో ఉండటంతో.. వారిద్దరి సంభాషణ చూసిన అధికారులు ఆమెను ప్రశ్నించగా తనతో జోక్ చేశానని అనన్య చెప్పడం విశేషం. అలాగే తాను డ్రగ్స్ తీసుకోలేదని, ఎవరికీ పంపించలేదని చెప్పింది. ఇక విచారణకు ముందు ఇంటరాగేషన్ గదిలోకి వెళ్లేటపుడు అనన్య ఆందోళనకు గురైందని, భయంతో ఏడ్చిందని మీడియా వర్గాలు వెల్లడించాయి.