పిక్స్‌తో పిచ్చెక్కిస్తున్న లైగర్ భామ..

by  |
ananaya
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ భామ అనన్య పాండే సరైన గుర్తింపు కోసం పోరాడుతోంది. కథలను ఆచితూచి ఎంచుకుంటూ స్టార్ హోదా కోసం అమ్మడు తెగ ఉబలాటపడుతోంది. ప్రస్తుతం అమ్మడు రౌడీ హీరో విజయ్ సినిమా ‘లైగర్’తో తెలుగులో అడుగుపెట్టనుంది. సినిమాల విషయంలో అమ్మడు కాస్త తక్కువగానే కనిపించినా.. సోషల్ మీడియాలో మాత్రం అభిమానులను అలరిస్తూనే ఉంటుంది. తన హాట్ ఫోటో షూట్‌లతో పాటు తన సినిమా అప్‌డేట్స్‌ని ఇస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది.

ఈ క్రమంలోనే తాజాగా అమ్మడు షేర్ చేసిన ఓ ఫోటో నెట్టింట మంటలు రేపుతున్నాయి. రెడ్ డ్రెస్‌లో కుర్రకారుకి చెమటలు పట్టిస్తోంది. ఈ ఫోటోను చూసిన నెటిజన్స్.. రెడ్ డ్రెస్‌లో చెర్రీలా ఉన్నావు అని కామెంట్లు చేస్తున్నారు. అంతేకాకుండా ఇంతటి అందం ఇన్నాళ్లూ ఏమైపోయిందంటూ ముద్దుగుమ్మను పొగిడేస్తున్నారు.

ఇదిలా ఉంటే అనన్య తన తాజా సినిమా ‘లైగర్’ కోసం చాలా కష్టపడుతోంది. ఈ సినిమాలో తాను చేయాల్సిన యాక్షన్ సీన్స్ కోసం కాస్త జిమ్నాస్టిక్స్ కూడా నేర్చుకున్న విషయం తెలిసిందే. మరి ఈ సినిమాతో అయినా అనన్య తను కోరుకున్న స్టార్ హోదా దక్కించుకుంటుందేమో చూడాలి.


Next Story

Most Viewed