అమీన్‌పూర్‌లో ఆనంద్‌ మృతదేహం లభ్యం

36

దిశ, వెబ్‌డెస్క్: సంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. ఈనెల 13న అమీన్‌పూర్ వద్ద మురుగు కాల్వలో కొట్టుకుపోయిన ఆనంద్ మృతదేహం లభ్యం అయ్యింది. ఐదురోజుల నుంచి ఆంనంద్‌ కోసం గాలింపు చర్యలు చేపట్టిన రెస్క్యూటీమ్‌ ఆదివారం మధ్యాహ్నం వెలికి తీసింది. మృతదేహం ఐదురోజులు నీటిలోనే నానడంతో మొత్తం ఉబ్బిపోయింది. ఆనంద్ మృతదేహాన్ని చూసిన కుటుంబ సభ్యులు, బంధువులు బోరున విలపిస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్‌లో పదుల సంఖ్యలో ప్రాణలు కోల్పోయిన సంగతి తెలిసిందే. శనివారం రాత్రి కురిసిన వర్షానికి హైదరాబాద్ నగరంలో మళ్లీ పలు కాలనీల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం నిత్యావసరాలు తెచ్చుకునేందుకు కూడా వీలు లేకపోవడంతో చిన్న పిల్లలు ఉన్న కుటుంబాలు అవస్థలు పడుతున్నాయి.