- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జర్నలిస్టులకు ఆనందయ్య మందు పంపిణీ..
<p>దిశ, బెల్లంపల్లి : కరోనా మహమ్మారి బారిన పడకుండా కొవిడ్ పాజిటివ్ రాని వారికి, కొవిడ్ బారినపడి కోలుకున్న జర్నలిస్టులు, వారి కుటుంబాలకు ఆనందయ్య ఆయుర్వేద మందును అందించారు. భీమిని కన్నెపల్లి మండలాల జర్నలిస్ట్ కుటుంబాలకు అభినవ స్వచ్చంద సేవాసంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడి ఆధ్వర్యంలో ఉచితంగా మందు పంపిణీ చేయడం అభినందనీయమని కన్నెపల్లి జడ్పీటీసీ కౌటారపు సత్యనారాయణ అన్నారు. శుక్రవారం కన్నెపల్లి మండల కేంద్రంలో జర్నలిస్టులకు అభినవ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఆనందయ్య ఆయుర్వేద మందును […]</p>

దిశ, బెల్లంపల్లి : కరోనా మహమ్మారి బారిన పడకుండా కొవిడ్ పాజిటివ్ రాని వారికి, కొవిడ్ బారినపడి కోలుకున్న జర్నలిస్టులు, వారి కుటుంబాలకు ఆనందయ్య ఆయుర్వేద మందును అందించారు. భీమిని కన్నెపల్లి మండలాల జర్నలిస్ట్ కుటుంబాలకు అభినవ స్వచ్చంద సేవాసంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడి ఆధ్వర్యంలో ఉచితంగా మందు పంపిణీ చేయడం అభినందనీయమని కన్నెపల్లి జడ్పీటీసీ కౌటారపు సత్యనారాయణ అన్నారు.
శుక్రవారం కన్నెపల్లి మండల కేంద్రంలో జర్నలిస్టులకు అభినవ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఆనందయ్య ఆయుర్వేద మందును అందజేశారు. ఈ కార్యక్రమానికి జడ్పీటీసీ కౌటారపు సత్యనారాయణ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభినవ స్వచ్ఛంద సేవ సంస్థ నిరంతం ప్రజాసేవలో ఉంటోందని కొనియాడారు. ప్రాణాలను ఫణంగా పెట్టి కొవిడ్ బాధితులను ఆదుకున్నారని అన్నారు.
పాజిటివ్ వచ్చిన వారి దగ్గరికి వెళ్లి మనోధైర్యాన్ని నింపుతూ వారికి అవసరం ఉన్న భోజనాలు, నిత్యావసర సరుకులు, మందులు ఇవ్వడం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సేవా సంస్థ సభ్యులు సూర రమేష్, కౌటారపు కార్తిక్, సూర సాకేత్, జర్నలిస్టులు మైదం రవీందర్, జిల్లాల శ్రీకాంత్ గౌడ్, గంగా కిషోర్, చెండే సత్యనారాయణ, పోనగంటి స్వామి, నందిపేట శ్రీనివాస్, అయిల్ల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.






