Anandayya : మందు కోసం మీరు కృష్ణపట్నం రావొద్దు: ఆనందయ్య

by Vemula.Srinu Prasad |   (  Updated:2021-06-02 03:54:21  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్: బయటి ప్రాంతాల వారు కరోనా మందు కోసం కృష్ణపట్నం రావొద్దని ఆనందయ్య కోరారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. మందు పంపిణీ వచ్చే ఆదివారం, సోమవారం నుంచి పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. బయటి ప్రాంతాలకు చెందిన వారు కృష్ణపట్నం వచ్చే అవసరం లేదని.. అన్ని ప్రాంతాలకు మందు పంపేందుకు కూడా ప్రణాళిక చేస్తామని ఆనందయ్య (Anandayya)చెప్పారు. కరోనా పాజిటివ్ రిపోర్టు తీసుకొచ్చిన వారు మందును [&hellip;]</p>

Ayurvedic doctor Anandayya
X

దిశ, వెబ్‌డెస్క్: బయటి ప్రాంతాల వారు కరోనా మందు కోసం కృష్ణపట్నం రావొద్దని ఆనందయ్య కోరారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. మందు పంపిణీ వచ్చే ఆదివారం, సోమవారం నుంచి పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. బయటి ప్రాంతాలకు చెందిన వారు కృష్ణపట్నం వచ్చే అవసరం లేదని.. అన్ని ప్రాంతాలకు మందు పంపేందుకు కూడా ప్రణాళిక చేస్తామని ఆనందయ్య (Anandayya)చెప్పారు. కరోనా పాజిటివ్ రిపోర్టు తీసుకొచ్చిన వారు మందును తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.

Next Story