ఎర్రబెల్లి బర్త్ డే స్పెషల్ : వారికి ఆనందయ్య కరోనా మందు పంపిణీ

by Shyam |

<p>దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్ : త‌న పుట్టిన రోజు (జులై 4)వ తేదీన నుంచి పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గంలోని ప్రజ‌లంద‌రికీ ఆనంద‌య్య క‌రోనా నివార‌ణ మందును పంపిణీ చేయనున్నట్లు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాక‌ర్‌రావు తెలిపారు. శ‌నివారం నియోజ‌క‌వ‌ర్గంలోని ప్రజాప్రతినిధులు, ముఖ్యుల‌తో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎర్రబెల్లి చారిట‌బుల్ ట్రస్ట్ ద్వారా దాదాపు రూ.40 ల‌క్షల వ్యయం చేస్తున్నట్లు వివరించారు. అందుక‌నుగుణంగా మొద‌టి ద‌శ‌లో 75వేల మందికి ఆనంద‌య్య మందును పంపిణీ ప్రారంభిస్తామన్నారు. అదేవిధంగా అవ‌స‌రాన్ని బ‌ట్టి [&hellip;]</p>

ఎర్రబెల్లి బర్త్ డే స్పెషల్ : వారికి ఆనందయ్య కరోనా మందు పంపిణీ
X

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్ : త‌న పుట్టిన రోజు (జులై 4)వ తేదీన నుంచి పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గంలోని ప్రజ‌లంద‌రికీ ఆనంద‌య్య క‌రోనా నివార‌ణ మందును పంపిణీ చేయనున్నట్లు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాక‌ర్‌రావు తెలిపారు. శ‌నివారం నియోజ‌క‌వ‌ర్గంలోని ప్రజాప్రతినిధులు, ముఖ్యుల‌తో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎర్రబెల్లి చారిట‌బుల్ ట్రస్ట్ ద్వారా దాదాపు రూ.40 ల‌క్షల వ్యయం చేస్తున్నట్లు వివరించారు. అందుక‌నుగుణంగా మొద‌టి ద‌శ‌లో 75వేల మందికి ఆనంద‌య్య మందును పంపిణీ ప్రారంభిస్తామన్నారు. అదేవిధంగా అవ‌స‌రాన్ని బ‌ట్టి నియోజ‌క‌వ‌ర్గంలో కావాల్సిన వారికి ఆనంద‌య్య మందును పంపిణీ చేస్తామ‌న్నారు. ఒక వైపు క‌రోనా రాకుండా ఉండేందుకు, మ‌రోవైపు క‌రోనా బాధితుల‌కు కూడా చికిత్స కోసం మందును ఉచితంగా పంపిణీ చేయ‌నున్నట్లు మంత్రి వెల్లడించారు.

క‌రోనా లేని వారికి ముందు జాగ్రత చ‌ర్యగా ఒక రోజు రెండు డోసులు, క‌రోనా వ‌చ్చిన వారికి అవ‌స‌ర‌మైన ఆనంద‌య్య మందును రెండు రోజులు.. మొత్తంగా 4 డోసుల క‌రోనా మందును ఇవ్వనున్నట్లు తెలిపారు. జులై 4వ తేదీ ఉద‌యం నుండి అన్ని గ్రామాల్లో ఉచిత పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేయనున్నట్లు.. అందుకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేశామ‌న్నారు. ఆనందయ్య మందు త‌యారైన తేదీ నుండి 15 రోజుల వ‌ర‌కు వినియోగించుకోవ‌చ్చని చెప్పారు.ఆయుర్వేద మందు సుర‌క్షిత‌మైన‌ద‌ని, ఏ విధ‌మైన ఇబ్బందులు ఉండ‌వ‌ని మంత్రి దయాకర్ రావు స్పష్టంచేశారు. క‌రోనా వ్యాక్సిన్‌తో సంబంధం లేకుండా వ్యాక్సిన్ తీసుకున్నవారు, ఇప్పటివ‌ర‌కు వ్యాక్సిన్ తీసుకోని వారు కూడా ఈ మందును వాడ‌వచ్చన్నారు. కావాల్సిన వారంద‌రికీ మందు పంపిణీ చేయాల‌ని, అవ‌స‌రం లేదనుకున్నవారికి బ‌ల‌వంతంగా ఈ మందును పంపిణీ చేయ‌వ‌ద్దని ఆయ‌న వాలంటీర్లకు సూచించారు.

Next Story