చెరువులో దూకి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య..

by Batti.Sumithra |

<p>దిశ, శేరిలింగంపల్లి : గుర్తు తెలియని వ్యక్తి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హాఫీజ్‌పేట్ ప్రకాశ్‌నగర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 26న ఉదయం 11.30 గంటల సమయంలో, ఓల్డ్ హాఫీజ్‌పేట్ ప్రకాష్ నగర్ కొత్తకుంట చెరువులో గుర్తు తెలియని వ్యక్తి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడన్న సమాచారం పోలీసులకు అందింది. దీంతో పోలీసులు అక్కడికి వెళ్ళి చూడగా అక్కడ ఎవరు కనబడ లేదు. డిజాస్టర్ మేనేజ్మెంట్ [&hellip;]</p>

చెరువులో దూకి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య..
X

దిశ, శేరిలింగంపల్లి : గుర్తు తెలియని వ్యక్తి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హాఫీజ్‌పేట్ ప్రకాశ్‌నగర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 26న ఉదయం 11.30 గంటల సమయంలో, ఓల్డ్ హాఫీజ్‌పేట్ ప్రకాష్ నగర్ కొత్తకుంట చెరువులో గుర్తు తెలియని వ్యక్తి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడన్న సమాచారం పోలీసులకు అందింది. దీంతో పోలీసులు అక్కడికి వెళ్ళి చూడగా అక్కడ ఎవరు కనబడ లేదు. డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫోర్స్, ఫైర్ సిబ్బందికి పోలీసులు సమాచారం అందించారు.

చెరువులో దూకిన వ్యక్తికోసం గత రెండురోజులుగా చెరువులో వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది. అయితే శనివారం ఉదయం మృతదేహం నీళ్లపై తేలడంతో డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫోర్స్, ఫైర్ సిబ్బంది మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడి వయస్సు సుమారు (30) సంవత్సరాలు ఉంటుందని, మృతుడి ఒంటిపై డార్క్ బ్లూ చొక్కా, బ్లాక్ పాంట్ ఉందని, మృతుడి వివరాలు తెలిసిన వారు పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

Next Story