- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పేరూరు గోదావరిలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం
by Batti.Sumithra |
<p>దిశ, వాజేడు : ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని పేరూరు గోదావరిలో గుర్తు తెలియని మృతదేహం శనివారం ఉదయం కనిపించింది. అటు వైపుగా వెళ్లిన స్థానికులకు మృతదేహం కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఇటీవల గోదావరి వరదలు సంభవించడంతో చత్తీస్‌ఘడ్ రాష్ట్రం నుండి గోదావరి వరదలు వచ్చాయి. ఈ వరదల్లో ఆ మృతదేహం అటు వైపునుంచి కొట్టుకు వచ్చినట్లు భావిస్తున్నారు. లభ్యమైన మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి ఉండడంతో మృతదేహాన్ని చూసేందుకు కూడా ఎవరు ముందుకు […]</p>

X
దిశ, వాజేడు : ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని పేరూరు గోదావరిలో గుర్తు తెలియని మృతదేహం శనివారం ఉదయం కనిపించింది. అటు వైపుగా వెళ్లిన స్థానికులకు మృతదేహం కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఇటీవల గోదావరి వరదలు సంభవించడంతో చత్తీస్‌ఘడ్ రాష్ట్రం నుండి గోదావరి వరదలు వచ్చాయి. ఈ వరదల్లో ఆ మృతదేహం అటు వైపునుంచి కొట్టుకు వచ్చినట్లు భావిస్తున్నారు.
లభ్యమైన మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి ఉండడంతో మృతదేహాన్ని చూసేందుకు కూడా ఎవరు ముందుకు రావడం లేదు. ఈ విషయాన్ని తెలుసుకున్న పేరూరు పోలీసులు మృతదేహం కోసం గోదావరికి వెళ్లారు. పోలీసులు వచ్చేలోపే మృతదేహం నీటిలో ఆ ప్రాంతం నుండి మరో ప్రాంతానికి కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది. మృతదేహం ఆచూకీ కోసం పోలీసులు కోసం గాలిస్తున్నారు.
Next Story






