KCR డౌన్ డౌన్ అంటూ వృద్ధుడి అర్ద నగ్న నిరసన.. ఎందుకంటే..?

by  |
KCR డౌన్ డౌన్ అంటూ వృద్ధుడి అర్ద నగ్న నిరసన.. ఎందుకంటే..?
X

దిశ, వికారాబాద్: వికారాబాద్ పట్టణ కేంద్రంలో ఓ వృద్ధుడు వినూత్న నిరసన చేపట్టాడు. చేతిలో తల గోరి పట్టుకొని, నొదుటిపై రూపాయి బిళ్ళ కట్టుకొని రామయ్య గూడ రోడ్డు నుంచి ప్రధాన రోడ్ల గుండా నిరసన చేపట్టాడు. తన ఇంటి సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వ కార్యాలయాల్లో అనేకసార్లు ఇచ్చిన వినతి పత్రాలను పోస్టర్ పై అతికించి భుజానికి కట్టుకొని, దీనికి తోడు అర్ధ నగ్న ప్రదర్శన చేస్తూ కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ నిరసన తెలిపాడు.

అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ఎవరూ పట్టించుకోకపోవడంతో విసిగిపోయి ఈ రీతిలో నిరసన చేస్తే అయినా పట్టించుకుంటారేమోనని ఇలా చేస్తున్నా అని అంటున్నాడు ఆ వృద్ధుడు. వికారాబాద్ పట్టణంలోని రాజీవ్ గృహకల్ప కాలనీలో నివాసముంటున్న (73) సంవత్సరాల వృద్ధుడు కృష్ణ పంక్చర్ షాప్ నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. తనకు ఏర్పడ్డ సమస్యను ఎవరూ పట్టించుకోకపోవడంతో ఈ నిరసన చేపట్టినట్లు తెలుస్తోంది.


Next Story

Most Viewed