- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరోనాను జయించాడు.. ఇంతలోనే దారుణం..
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఓ వృద్దుడు కరోనాతో పోరాడి జయించాడు. ఇంతలోనే రోడ్డు ప్రమాదంలో తుది శ్వాస విడిచాడు. ఈ విషాదకర ఘటన మెదక్ జిల్లాలోని తుప్రాన్ మండలంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. తుప్రాన్ మున్సిపాలిటీ పరిధిలోని రావెలికి చెందిన నన్నేమియా(75), ఆయన భార్య.. ఇద్దరూ ఒకేసారి కరోనా బారిన పడ్డారు. హోం ఐసోలేషన్‌లో ఉండి వారు కరోనాను జయించారు. ఈ క్రమంలో ద్విచక్ర వాహనంపై కూరగాయలు తెచ్చుకునేందుకు నన్నేమియా.. తుప్రాన్ వైపు వెళ్తుండగా డీసీఎం వ్యాన్ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : ఓ వృద్దుడు కరోనాతో పోరాడి జయించాడు. ఇంతలోనే రోడ్డు ప్రమాదంలో తుది శ్వాస విడిచాడు. ఈ విషాదకర ఘటన మెదక్ జిల్లాలోని తుప్రాన్ మండలంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. తుప్రాన్ మున్సిపాలిటీ పరిధిలోని రావెలికి చెందిన నన్నేమియా(75), ఆయన భార్య.. ఇద్దరూ ఒకేసారి కరోనా బారిన పడ్డారు. హోం ఐసోలేషన్‌లో ఉండి వారు కరోనాను జయించారు. ఈ క్రమంలో ద్విచక్ర వాహనంపై కూరగాయలు తెచ్చుకునేందుకు నన్నేమియా.. తుప్రాన్ వైపు వెళ్తుండగా డీసీఎం వ్యాన్ బైకును ఢీకొట్టింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. కరోనాను జయించినప్పటికీ రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో.. భార్య, కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదం నెలకొంది.
Next Story






