మల్టీ టాలెంటెడ్.. నభా నటేష్

by  |
మల్టీ టాలెంటెడ్.. నభా నటేష్
X

దిశ, వెబ్ డెస్క్: హీరోయిన్స్‌లో చాలా మంది మల్టీ టాలెంటెడ్ ఉన్నారు. బిజినెస్‌లో రాణిస్తున్న సమంత, సింగర్‌గా రాణిస్తున్న రాశి ఖన్నా, గిటార్ ప్లే చేసి సూపర్ ట్రీట్ ఇచ్చిన కీర్తి సురేష్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది బహుముఖ ప్రజ్ఞాశాలులు ఉన్నారు. ఆ గ్రూప్‌లో చేరింది ముద్దుగుమ్మ, ఇస్మార్ట్ భామ నభా నటేష్. బ్యాట్ మాన్ ఫ్యాన్ అయిన నభా..బ్యాట్ మాన్‌కు అంకితం ఇస్తూ పెయింటింగ్ వేసింది. ఇది గీస్తున్నంత సేపు చాలా ఉల్లాసంగా అనిపించిందని, సరిగ్గా వేసేందుకు 6-7 సార్లు ప్రయత్నించాను అని చెప్పింది. దీన్ని మీరు ప్రత్యక్షంగా చూస్తే నన్ను చూసి గర్వపడతారని అంటున్న నభా..మీరు బ్యాట్ మన్ ఫ్యాన్ అయితేనే అలా చేయగలరని అంటుంది. నేను ఎలా ఉన్నది కాదు..నేను ఏం చేశాను అనేదే నన్ను నిర్వచిస్తుందన్న బ్యాట్ మాన్ కొటేషన్‌తో తను వేసిన పెయింటింగ్ షేర్ చేసింది. కాగా, ఈ పెయింటింగ్ చూసిన అభిమానులు నభా మల్టీ టాలెంట్‌కు ముచ్చటపడి పోతున్నారు. నువ్వు బ్యాట్ మాన్ ఫ్యాన్ అయితే, మేము నీ డైహార్డ్ ఫ్యాన్స్ అని చెప్తున్నారు.

https://www.instagram.com/p/CGHOSRXnRNA/?utm_source=ig_web_copy_link

కాగా, నభా ప్రస్తుతం ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా చేస్తుంది. సాయి‌ధరమ్‌తేజ్ హీరోగా వస్తున్న సినిమా షూటింగ్ లాక్ డౌన్ తర్వాతే పూర్తి అయింది. షూటింగ్ చివరి రోజున నభాకు గిఫ్ట్ కూడా ఇచ్చాడు తేజ్. ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు ఇప్పటికే సూపర్ హిట్ అయ్యాయి కూడా.



Next Story

Most Viewed