వికలాంగునికి చేయూతనందించిన ‘హోప్ ఫర్ స్పందన’

by  |
Hope for spandana
X

దిశ, మఠంపల్లి: పుట్టుకతోనే అంగవైకల్యం ఏర్పడి చిన్న వయస్సులోనే తల్లిదండ్రులను కోల్పోయిన సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం కాల్వపల్లి తండాకు చెందిన భూక్య బలరాం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. బయటకెళ్లి ఏం పని చేయలేక సోదరుడిపై ఆధారపడి జీవిస్తున్నాడు. దీంతో ఈ విషయాన్ని అమెరికాలో స్థిరపడిన మఠంపల్లి మండల కేంద్రానికి చెందిన ఎన్ఆర్ఐ డాక్టర్ దొంతిరెడ్డి నరసింహారెడ్డి దృష్టికి గ్రామస్తులు తీసుకువెళ్లారు. అమెరికాలో వికలాంగులకు సేవలందిస్తున్న ‘‘హోప్ ఫర్ స్పందన’’ అనే సంస్థ ప్రతినిధులతో మాట్లాడి బలరాంకి ఆర్థిక సాయం చేయాలని కోరారు.

ఇందుకు ‘‘హోప్ ఫర్ స్పందన’’ ప్రతినిధులు లక్ష్మీనరసింహం కోట, శర్వని కోట, హరి కళ్ళా కోట, రఘు అర్లపూడి సానుకూలంగా స్పందించారు. ఇకనుంచి బలరాం ఎవరిపైనా ఆధారపడి జీవించకుండా ఉండేందుకు ఒక లక్షా ఇరవై వేల రూపాయలను అతని చేత కిరాణం షాపు పెట్టించారు. సోదరుడిపై ఆధారపడి జీవిస్తోన్న వికలాంగుడికి సొంత కాళ్లపై జీవించేలా కృషి చేసిన ‘‘హోప్ ఫర్ స్పందన’’ సంస్థ ప్రతినిధులను గ్రామస్తులు ప్రసంశించారు. కాగా, భూక్య బలరాం కిరాణ షాపు కోసం దగ్గరుండి ఏర్పాట్లు చేసిన ఇండియా సహాయకులు రఘు అరికెపూడికి బలరాం ధన్యవాదాలు తెలిపారు.


Next Story