యూఎస్ దుస్సాహసం.. భారత జలాల్లోకి అమెరికా నౌక

165
American ship

న్యూఢిల్లీ : భారత ప్రాదేశిక జలాల్లోకి అనుమతిలేకుండా అమెరికా నౌక ప్రవేశించడమే కాకుండా.. నావిగేషన్ ఆపరేషన్ నిర్వహిస్తామని ఆ దేశ నౌకాదళం చేసిన ప్రకటనపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. లక్షద్వీప్‌లోని భారత ప్రత్యేక ఆర్థిక జోన్‌ (ఈఈజెడ్)లో నావిగేషన్ ఆపరేషన్ (ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషనల్ ఆపరేషన్) కోసం అమెరికా నౌక యూఎస్ఎస్ జాన్ పాల్ జోన్స్ ప్రవేశించింది.

ఈ నెల 7న లక్షద్వీప్‌కు పశ్చిమాన సుమారు 130 నాటికల్ మైళ్ల దూరంలో భారత ప్రాదేశిక జలాల్లో ప్రవేశించినట్టు యూఎస్ తెలిపింది. అయితే సంబంధిత దేశం అనుమతి తీసుకోకుండా ఆ దేశ ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించడం మారీటైమ్ భద్రతా విధానానికి విరుద్ధం. కానీ, అమెరికా నౌక మాత్రం అంతర్జాతీయ చట్టానికి అనుగుణంగానే ప్రవేశించినట్టు సమర్ధించుకుంటోంది. దీనిపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..