హీరోయిన్ పేరును అక్కడ పచ్చబొట్టు వేయించుకున్న అభిమాని

by  |
Amritha Aiyer
X

దిశ, సినిమా : బ్యూటిఫుల్ అమృతా అయ్యర్ ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’, ‘రెడ్’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. తమిళ్‌లో ‘లిఫ్ట్’ మూవీ ద్వారా రీసెంట్ హిట్ అందుకుని విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఫ్యాన్స్ తన యాక్టింగ్ గురించి ప్రౌడ్‌గా ఫీల్ అవుతుండగా.. ఈ క్రమంలోనే అమృత పేరును పచ్చబొట్టు వేయించుకున్నాడు ఓ అభిమాని. ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ చేసిన భామ.. ఇది చూడగానే ఆనందంతో ఏడ్చేశానని తెలిపింది. ఇది తనకు చాలా ఎమోషనల్ మోమెంట్ అని, మీ ప్రేమకు ధన్యవాదాలు తెలిపేందుకు మాటలు సరిపోవని చెప్పింది. కానీ తనపై చూపిస్తున్న ప్రేమను జీవితాంతం గుర్తుంచుకుంటానన్న అమృత త్వరలోనే ఆ అభిమానిని కలుస్తానని హామీ ఇచ్చింది.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed