- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఎం జగన్‌కు అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ లేఖ
<p>దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి అమరావతి పరిరక్షణ సమితి జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ ఎ.శివారెడ్డి శనివారం లేఖ రాశారు. ఏపీ రాజధాని అమరావతి ఒకే కులం వారిదని మీరు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల వారే కావడం మీ దృష్టిలో డెమొగ్రఫిక్ ఇంబ్యాలెన్సా అన్నారు. 13జిల్లాల చిన్న రాష్ట్రం అయిపోయింది.. అమరావతిని స్వాగతిస్తున్నామని గతంలో మీరు అన్నది నిజం కాదా అని గుర్తు చేశారు. ప్రజల మధ్య విద్వేషాలు […]</p>

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి అమరావతి పరిరక్షణ సమితి జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ ఎ.శివారెడ్డి శనివారం లేఖ రాశారు. ఏపీ రాజధాని అమరావతి ఒకే కులం వారిదని మీరు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల వారే కావడం మీ దృష్టిలో డెమొగ్రఫిక్ ఇంబ్యాలెన్సా అన్నారు. 13జిల్లాల చిన్న రాష్ట్రం అయిపోయింది.. అమరావతిని స్వాగతిస్తున్నామని గతంలో మీరు అన్నది నిజం కాదా అని గుర్తు చేశారు. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం సీఎం స్థాయికి తగదన్నారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పెద్దదిక్కుగా ఉన్న మీరు.. పదే పదే అబద్దాలు చెప్పడం మంచిది కాదని పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాల వారికి ఇళ్లు నిర్మించి ఇస్తామంటే జేఏసీకి ఎటువంటి అభ్యంతరం లేదని, కానీ రాష్ట్రమంతా లక్షలాది గృహాలు లబ్దిదారులకు కేటాయించడంలోనే మీరు పూర్తిగా విఫలమయ్యారన్నారు. అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగిస్తూ అన్నిప్రాంతాలను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మీపై ఉందని లేఖలో శివారెడ్డి వివరించారు.






