- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అంగన్వాడి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్
అంగన్వాడి కేంద్రాన్ని సక్రమంగా నిర్వహించని అధికారులపై హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి ఆగ్రహం వ్యక్తం చేశారు .

దిశ , హైదరాబాద్ బ్యూరో: అంగన్వాడి కేంద్రాన్ని సక్రమంగా నిర్వహించని అధికారులపై హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు కలెక్టర్ యూసుఫ్ గూడ ఆరోగ్య నగర్ లో గల నాట్కో అంగన్వాడి కేంద్రం, సుభాష్ నగర్ లోని అంగన్వాడి కేంద్రాలను సోమవారం ఆకస్మికంగా సందర్శించారు . పిల్లల సంఖ్య, స్టాక్ వివరాలు, హాజరు పట్టికను పరిశీలించారు ఈ సందర్భంగా సుభాష్ నగర్ అంగన్వాడి కేంద్రం నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండడంతో అక్కడ ఉన్న పిల్లలను ఆరోగ్యనగర్ కేంద్రానికి తరలించాలని ఆదేశించారు. అక్కడున్న అధికారులను మందలించారు . అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ...
గర్భవతులకు క్రమం తప్పకుండా టీకాలు అందించాలన్నారు. జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తుండడంతో అంగన్వాడీ కేంద్రాలలోని పిల్లలకు వ్యాధులు సోకే ప్రమాదముందని, వారి ఆరోగ్య పరిరక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, పరిసర ప్రాంతాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ఎన్ హెచ్ పి ఎస్ ( న్యూట్రిషన్ హెల్త్ ప్యాకింగ్ సిస్టం ) యాప్ ను పరిశీలించి సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు. నిబంధన మేరకు పిల్లల వయస్సు కు తగ్గ ఎదుగుదలను ఎప్పటికప్పుడు పరిశీలించి సంబంధిత యాప్ లో నమోదు చేయాలని, అంగన్వాడి కేంద్రాలను తరచుగా సిడిపివోలు, సూపర్వైజర్లు తనిఖీలు నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ ప్రేమ్ కుమార్, సిడిపిఓ పుష్ప, భారతీరత్నం, టీచర్లు చంద్రకళ, ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు.






