ఈసారి ఐస్ ఫ్యాక్టరీలో.. గ్యాస్ లీక్

by  |
ఈసారి ఐస్ ఫ్యాక్టరీలో.. గ్యాస్ లీక్
X

దిశ, ఏపీ బ్యూరో: విశాఖ పట్టణం ఆర్ఆర్ వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్‌లో స్టైరిన్ గ్యాస్ లీకై 12 మంది దుర్మరణం పాలైన ఘటన మరువకముందే.. మరో గ్యాస్ లీక్ ఘటన స్థానిక ప్రజలను ఆందోళనకు గురి చేసింది. వివరాల్లోకి వెళ్తే.. తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలు దగ్గర్లోని మల్కిపురం మండలానికి చెందిన విశ్వేశ్వరాయపురం గ్రామంలోని వెంకటేశ్వర ఐస్ ఫ్యాక్టరీలో అమ్మోనియం గ్యాస్ లీక్ ఘటన కలకలం రేపింది. గ్యాస్ లీక్ కావడంతో గ్రామస్థులు ఊపిరాడక ఉక్కిరబిక్కిరయ్యారు. ఐస్ ఫ్యాక్టరీలోని మూడు సిలెండర్ల నుంచి గ్యాస్ లీకైంది. ఫిర్యాదు అందుకున్న రెవెన్యూ, ఫైర్, పోలీసు సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని, కంపెనీకి 200 మీటర్ల దూరంలోని ఇళ్లను ఖాళీ చేయించి, నీటిని స్ప్రింకిల్ చేస్తున్నారు.

Next Story

Most Viewed