- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాడేరులో అమ్మవారి విగ్రహం ధ్వంసం
by Vemula.Srinu Prasad |
<p>దిశ, విశాఖపట్నం : విజయనగరం జిల్లాలోని రామతీర్థం ఆలయంలో శ్రీరాముడి విగ్రహం తలను నరికేసిన ఘటన మరువక ముందే… తాజాగా శుక్రవారం విశాఖ జిల్లా పాడేరు ఘాట్‌లోని అమ్మవారి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రెండురోజుల క్రితం అమ్మవారి పాదాలను దుండగులు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. అయితే రాష్ట్రంలో ఆలయాలపై వరుసగా జరుగుతున్న ఘటనలపై హిందూ సంఘాలు, భక్తులు ఆగ్రహం […]</p>

X
దిశ, విశాఖపట్నం : విజయనగరం జిల్లాలోని రామతీర్థం ఆలయంలో శ్రీరాముడి విగ్రహం తలను నరికేసిన ఘటన మరువక ముందే… తాజాగా శుక్రవారం విశాఖ జిల్లా పాడేరు ఘాట్‌లోని అమ్మవారి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రెండురోజుల క్రితం అమ్మవారి పాదాలను దుండగులు ధ్వంసం చేశారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. అయితే రాష్ట్రంలో ఆలయాలపై వరుసగా జరుగుతున్న ఘటనలపై హిందూ సంఘాలు, భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఘటనపై హిందూ ధార్మిక సంఘం నాయకలు శ్రీరామ్ మాట్లాడుతూ తరుచుగా విగ్రహాల ధ్వంసంతో హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. విగ్రహాల ధ్వంసంపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాల తరుపున డిమాండ్ చేస్తున్నామన్నారు.
Next Story






