- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బండికి అమిత్ షా అభినందన..
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేశారు. దుబ్బాక ఉపఎన్నికలో బీజేపీ గెలుపొందడం పట్ల అభినందనలు తెలిపారు. నెక్ టు నెక్ సాగిన ఎన్నికల కౌంటింగ్‌లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు 1,118 ఓట్ల మెజార్టీతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఓ వైపు విజయోత్సహంతో బీజేపీ శ్రేణులు సంబురాలు చేసుకుంటుండగా.. దుబ్బాక బై పోల్ కౌంటింగ్ ఇంకా పూర్తి కాలేదని రాష్ట్ర […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేశారు. దుబ్బాక ఉపఎన్నికలో బీజేపీ గెలుపొందడం పట్ల అభినందనలు తెలిపారు. నెక్ టు నెక్ సాగిన ఎన్నికల కౌంటింగ్‌లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు 1,118 ఓట్ల మెజార్టీతో విజయం సాధించిన విషయం తెలిసిందే.
ఓ వైపు విజయోత్సహంతో బీజేపీ శ్రేణులు సంబురాలు చేసుకుంటుండగా.. దుబ్బాక బై పోల్ కౌంటింగ్ ఇంకా పూర్తి కాలేదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ శశాంగ్ గోయల్ ప్రకటించి అందరినీ షాక్ కు గురిచేశారు. నాలుగు ఈవీఎంలు మొరాయించగా అందులో లెక్కించాల్సిన ఓట్లు ఇంకా 1,669 ఉన్నాయని ఈసీ తెలిపింది. వాటి ఫలితాలు తేలే వరకు అభ్యర్థుల గెలుపోటములు డిక్లేర్ చేయరాదని ఈసీ స్పష్టంచేసింది.
Next Story






