‘బిగ్‌ బీ’కి కలర్‌ఫుల్ ట్రిబ్యూట్

by  |
‘బిగ్‌ బీ’కి కలర్‌ఫుల్ ట్రిబ్యూట్
X

దిశ, వెబ్‌డెస్క్ : ఫేస్ ఆఫ్ ఇండియన్ సినిమా.. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 51 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ ప్రయాణంలో ఎన్నో ప్రయోగాలు చేస్తూ కమాండబుల్ రోల్స్ చేసిన బచ్చన్ జీ.. బాలీవుడ్ యాక్టింగ్ స్టాండర్డ్స్‌ పెంచారనడంలో సందేహం లేదు. న్యూ జనరేషన్స్‌కు ఐకాన్‌గా నిలుస్తూ.. వారితో పోటీపడి మరీ నటిస్తూ బాలీవుడ్ బిగ్ బీగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. ఈ జర్నీలో దేశవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు బచ్చన్ సాబ్.

అయితే బిగ్ బీ బాలీవుడ్‌లో 51 ఏళ్ల మార్క్ కంప్లీట్ చేసుకోగా.. తన వీరాభిమాని ఓ స్పెషల్ గిఫ్ట్ అందించాడు. అమితాబ్ సినీ ప్రయాణపు నాందిని తెలుపుతూ లేటెస్ట్‌గా ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ ప్రోగ్రామ్‌లో రంగోళి ప్రెజెంట్ చేశాడు. ఈ పిక్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన బిగ్ బీ ఆ అభిమానికి థాంక్స్ చెప్పాడు. ఈ రంగోళిలో తన పిక్చర్‌తో పాటు తన తొలి సినిమా ‘సాత్ హిందుస్థానీ’ పేరు, మూవీ రిలీజ్ డేట్( నవంబర్ 7, 1969) కూడా పొందుపరిచాడని తెలిపారు. ఈ పోస్ట్ వైరల్ కాగా.. రంగోళి నిజంగా రంగోళిలా కాకుండా పెయింటింగ్‌లా కనిపించడం విశేషం.

Next Story