అమితాబ్‌ను కడిగిపారేసిన లేడీ కొరియోగ్రాఫర్..

by  |
అమితాబ్‌ను కడిగిపారేసిన లేడీ కొరియోగ్రాఫర్..
X

దిశ, సినిమా : బిగ్ బీ అమితాబ్ బచ్చన్‌ హోస్ట్ చేస్తున్న షో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి 13’ రియాలిటీ షోకు హీరోయిన్ దీపికా పదుకొనే, డైరెక్టర్ ఫరా ఖాన్ గెస్ట్‌గా హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ప్రోమోను సోనీ చానల్ రిలీజ్ చేయగా.. డ్యాన్స్ స్టెప్స్ సరిగ్గా చేయట్లేదని ఫరా ఖాన్ తనను తిట్టిందని గుర్తుచేసుకున్నాడు బచ్చన్ జీ. ‘కభీ అల్విదా నా కెహనా’ సినిమాలోని ‘రాక్ అండ్ రోల్ సోనియే’ సాంగ్ రిహార్సల్స్ టైమ్‌లో ఇది జరిగిందని తెలిపాడు. ఎన్నిసార్లు రిహార్సల్స్ చేసినా స్టెప్ రాకపోవడంతో ‘ఏమనుకుంటున్నావ్ నువ్వు.. సరిగ్గా చేయ్’ అని తనపై గట్టిగా అరిచిందన్నాడు. ఇదే సందర్భంగా ‘నిన్ను ఎప్పుడైనా ఫరా తిట్టిందా?’ అని దీపికాను బచ్చన్ ప్రశ్నించగా.. ‘ఎప్పుడు తిట్టలేదో అడగండి’ అని రిప్లై ఇచ్చింది దీపిక.


Next Story

Most Viewed