ప్రభాస్ మూవీలో బిగ్ బి..

by  |
ప్రభాస్ మూవీలో బిగ్ బి..
X

దిశ, వెబ్ డెస్క్: ప్రభాస్ సినిమా కోసమే పుట్టాడు. తన కోసమే కథలు పుడుతున్నాయి. బాహుబలి తర్వాత విశ్వవ్యాప్తం అయిన తన క్రేజ్..రోజు రోజుకూ మరింత పెరుగుతూనే ఉంది. పెరుగుతూనే ఉంటుంది కూడా..అందులో సందేహం లేదు. అలాంటి నటుడితో మరో లివింగ్ లెజెండ్ జత కడితే.. ఫేస్ ఆఫ్ ది ఇండియన్ సినిమాగా అభివర్ణించే మహానటుడు ప్రభాస్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంటే.. ఆ కిక్కే వేరు కదా. అలాంటి కిక్ ఇచ్చే కాంబినేషన్‌ను తీసుకురాబోతుంది వైజయంతి మూవీస్ నిర్మాణ సంస్థ.

నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో ప్రభాస్ సినిమా ఇప్పటికే ప్రకటించగా నంబర్ వన్ హీరోయిన్, ప్రిన్సెస్ దీపికా పదుకునే ప్రిన్స్ ప్రభాస్‌తో జతకడుతుందన్న వార్త అభిమానులకు సూపర్ హ్యాపీనెస్ ఇవ్వగా..ఇప్పుడు లివింగ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ కూడా ఈ సినిమాలో పార్ట్ కాబోతున్నారని ప్రకటించింది వైజయంతి మూవీస్. బిలియన్ భారతీయులు గర్వించదగ్గ వ్యక్తికి మనస్ఫూర్తిగా అహ్వానిస్తున్నట్లు తెలిపింది. బిగ్ బి రాకతో మా జర్నీ బిగ్గర్ అయిపోయిందని తెలిపింది. ఫైనల్‌గా బిగ్ బి అమితాబ్ బచ్చన్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవాలన్న తన కల ఈ సినిమా ద్వారా నెరవేరబోతుందని.. బచ్చన్‌కు వెల్ కమ్ చెప్పారు ప్రభాస్.

https://twitter.com/VyjayanthiFilms/status/1314423325486055425?s=19


Next Story

Most Viewed