నా పేరు సరిగ్గా పలకండి… లేదంటే రూ.5000 ఫైన్ కట్టండి

by  |
నా పేరు సరిగ్గా పలకండి… లేదంటే రూ.5000 ఫైన్ కట్టండి
X

దిశ, సినిమా : బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ తన పేరును ఎలా ప్రొనౌన్స్ చేయాలో తెలుపుతూ ఓ వీడియో పోస్ట్ చేసింది. మీడియా, సోషల్ మీడియాతో పాటు అన్ని చోట్ల తన పేరును తప్పుగా పలుకుతున్నారని.. ఇప్పటి వరకు ఎలా పిలిచినా, ఇక నుంచి అయినా సరిగ్గా ప్రొనౌన్స్ చేయాలని కోరింది. అందుకే ఈ వీడియో ద్వారా అందరినీ ఎడ్యుకేట్ చేయాలనుకుంటున్నాను అని చెప్పుకొచ్చింది. అంతేకాదు తన పేరును ఎవరూ సరిగ్గా పలకడం లేదని ఫ్రెండ్స్ టీజ్ చేస్తున్నారని.. ఇకపై అలా పలికిన ప్రతీసారి స్వేర్ బాక్స్‌లో రూ. 5000 వేయాలని కోరింది. ఆ డబ్బులను ఇయర్ ఎండింగ్‌లో అనాథాశ్రమాలకు డొనేట్ చేస్తానని తెలిపింది. కాగా ఐరా గతంలో తను డిప్రెషన్‌లో ఉన్నానంటూ చేసిన పోస్ట్‌లు వైరల్‌గా మారగా.. ఇప్పుడు ఈ పోస్ట్ కూడా వైరల్ అయిపోయింది.

Next Story

Most Viewed