కామాంధుడిపై తిరగబడ్డ మహిళ

by Vadlamudi Anukaran |   (  Updated:2020-08-24 11:04:44  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్: అమెరికన్ మహిళ మార్చిలో తమిళనాడుకు వచ్చింది. ఈ సమయంలో కరోనా కారణంగా లాక్‌డౌన్ విధించడంతో అమెరికాకు వెళ్లలేకపోయింది. దాదాపు ఆరు నెలల నుంచి ఓ ఇంటిని అద్దె తీసుకుని తిరువన్నమళైలోని అరునాచల్ నగర్‌లో నివాసం ఉంటుంది. అదే ప్రాంతానికి చెందిన మనికందన్ అనే వ్యక్తి అమెరికన్ మహిళపై కన్నేశాడు. పలుసార్లు ఆమెను గమనిస్తూ ఉండేవాడు. ఆమెపై అత్యాచారం చేయాలనుకుని ఆదివారం కాషాయ దుస్తులు, రుద్రాక్ష ధరించి స్వామీజీలా ఆమె ఇంట్లోకి దూరాడు. ఒక్కసారిగా ఆమెపై [&hellip;]</p>

కామాంధుడిపై తిరగబడ్డ మహిళ
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికన్ మహిళ మార్చిలో తమిళనాడుకు వచ్చింది. ఈ సమయంలో కరోనా కారణంగా లాక్‌డౌన్ విధించడంతో అమెరికాకు వెళ్లలేకపోయింది. దాదాపు ఆరు నెలల నుంచి ఓ ఇంటిని అద్దె తీసుకుని తిరువన్నమళైలోని అరునాచల్ నగర్‌లో నివాసం ఉంటుంది. అదే ప్రాంతానికి చెందిన మనికందన్ అనే వ్యక్తి అమెరికన్ మహిళపై కన్నేశాడు.

పలుసార్లు ఆమెను గమనిస్తూ ఉండేవాడు. ఆమెపై అత్యాచారం చేయాలనుకుని ఆదివారం కాషాయ దుస్తులు, రుద్రాక్ష ధరించి స్వామీజీలా ఆమె ఇంట్లోకి దూరాడు. ఒక్కసారిగా ఆమెపై అత్యాచారయత్నానికి పూనుకున్నాడు. అయితే సదరు మహిళ అతనిపై తిరగబడి కత్తితో పొడ్చింది. ఆమెకు మార్షల్ ఆర్ట్స్ లో మంచి ప్రావీణ్యం ఉండటంతో తనను తాను రక్షించుకుంది. ఆమె అరుపులు విని స్థానికులు ఇంట్లోకి వచ్చి నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

Next Story