- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గండిపేట్ లో అమెరికా వాసి మృతి
<p>దిశ, రంగారెడ్డి: సైక్లింగ్ చేస్తూ అమెరికా దేశస్థుడు మృతిచెందిన ఘటన నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అమెరికాకు చెందిన పాల్ రాబర్ట్ లిటిల్ జాన్ అనే వ్యక్తి గండిపేట్ ప్రాంతంలో సైక్లింగ్ చేస్తూ ప్రమాదవశాత్తు మృతిచెందాడని పోలీసులు తెలిపారు. మృతుడి భార్య ఈరికా యాంజెలీనా అమెరికా స్టేట్ కార్పొరేషన్ సంస్థలో వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తుందని, ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు. సైక్లింగ్ […]</p>

X
దిశ, రంగారెడ్డి: సైక్లింగ్ చేస్తూ అమెరికా దేశస్థుడు మృతిచెందిన ఘటన నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అమెరికాకు చెందిన పాల్ రాబర్ట్ లిటిల్ జాన్ అనే వ్యక్తి గండిపేట్ ప్రాంతంలో సైక్లింగ్ చేస్తూ ప్రమాదవశాత్తు మృతిచెందాడని పోలీసులు తెలిపారు. మృతుడి భార్య ఈరికా యాంజెలీనా అమెరికా స్టేట్ కార్పొరేషన్ సంస్థలో వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తుందని, ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు. సైక్లింగ్ చేస్తూ కిందపడి పోవటంతోనే అతను మృతి చెందినట్లు దర్యాప్తులో వెల్లడైందని, మృతుడు గచ్చిబౌలిలోని ఓ లగ్జరీ అపార్ట్ మెంట్ లో సంవత్సరం నుంచి ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు.
Next Story






