- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారత్ కి వెళ్లొద్దు -అమెరికా
<p>దిశ, వెబ్ డెస్క్: అమెరికాలో కరోనా కారణంగా అమలవుతున్న లెవెల్-4 ఆరోగ్య హెచ్చరికలను ఎత్తివేసి లెవెల్-3 సూచనలు అమలు చేస్తోంది. దీంతో ఆ దేశ పౌరులకు సూచించే ప్రయాణ మార్గదర్శకాలను సైతం సవరించింది. అయినప్పటికీ భారత్, చైనా, మరో 50 దేశాలకు లెవెల్-4 ప్రయాణ సూచనలను కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. దీంతో భారత్ కు వెళ్ళొద్దని అమెరికా తన పౌరులకు సూచించింది. మార్చి-19 నుండి దాదాపు అన్ని దేశాల రాకపోకలు నిలిపివేసిన అమెరికా తాజా నిర్ణయంతో కొన్నివిదేశీ ప్రయాణాలకు అనుమతులు ఇచ్చింది. కొన్ని దేశాలలో వైరస్ తీవ్రత తగ్గడంతో […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: అమెరికాలో కరోనా కారణంగా అమలవుతున్న లెవెల్-4 ఆరోగ్య హెచ్చరికలను ఎత్తివేసి లెవెల్-3 సూచనలు అమలు చేస్తోంది. దీంతో ఆ దేశ పౌరులకు సూచించే ప్రయాణ మార్గదర్శకాలను సైతం సవరించింది. అయినప్పటికీ భారత్, చైనా, మరో 50 దేశాలకు లెవెల్-4 ప్రయాణ సూచనలను కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. దీంతో భారత్ కు వెళ్ళొద్దని అమెరికా తన పౌరులకు సూచించింది.
మార్చి-19 నుండి దాదాపు అన్ని దేశాల రాకపోకలు నిలిపివేసిన అమెరికా తాజా నిర్ణయంతో కొన్నివిదేశీ ప్రయాణాలకు అనుమతులు ఇచ్చింది. కొన్ని దేశాలలో వైరస్ తీవ్రత తగ్గడంతో ఈ నిర్ణయం తీసుకుంది. కోవిడ్ తీవ్రత తగ్గని దేశాలకు మాత్రం ఆంక్షలు విధించింది.
Next Story






