- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాకు ప్రాణభయం ఉంది : అమీషా పటేల్
<p>దిశ, వెబ్‌డెస్క్ : ‘బద్రి’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బాలీవుడ్ హీరోయిన్ అమీషా పటేల్‌ను అత్యాచారం చేసి హత్య చేస్తామని బెదిరించినట్టు బిహార్‌కు చెందిన నాయకుడిపై ఆరోపణలు చేసింది. బిహార్‌కు వెళ్తే ఘనస్వాగతం లభిస్తుందనుకున్న తనకు ఇలాంటి పరాభావం ఎదురైందని వాపోయింది. అసలు విషయం ఏంటంటే.. ఎల్‌జేపీ అభ్యర్థి ప్రకాష్ చంద్ర తరపున ప్రచారం చేసేందుకు అమీషా స్టార్ క్యాంపెయినర్‌గా బిహార్ వెళ్లింది. కానీ అక్కడ బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ చూశానని, ప్రకాష్ చంద్ర వల్ల […]</p>

దిశ, వెబ్‌డెస్క్ :
‘బద్రి’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బాలీవుడ్ హీరోయిన్ అమీషా పటేల్‌ను అత్యాచారం చేసి హత్య చేస్తామని బెదిరించినట్టు బిహార్‌కు చెందిన నాయకుడిపై ఆరోపణలు చేసింది. బిహార్‌కు వెళ్తే ఘనస్వాగతం లభిస్తుందనుకున్న తనకు ఇలాంటి పరాభావం ఎదురైందని వాపోయింది. అసలు విషయం ఏంటంటే.. ఎల్‌జేపీ అభ్యర్థి ప్రకాష్ చంద్ర తరపున ప్రచారం చేసేందుకు అమీషా స్టార్ క్యాంపెయినర్‌గా బిహార్ వెళ్లింది. కానీ అక్కడ బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ చూశానని, ప్రకాష్ చంద్ర వల్ల తనకు ప్రాణభయం ఉందని చెప్పింది. అసలు ప్రకాష్ చంద్ర గురించి తనకేమీ తెలియదని, తన గురించి చాలా గొప్పగా చెప్పాలని ఒత్తిడి చేశారని తెలిపింది. లేదంటే చంపేస్తామని బెదిరించారన్న అమీషా.. తన ప్రెజెన్స్‌ను మిస్ యూజ్ చేశారని తెలిపింది.
అయితే, అలాంటిదేమీ లేదని అమీషా పటేల్ ఆరోపణలను ఖండించారు ప్రకాష్ చంద్ర. ప్రచారం చేసేందుకు తన బంధువు పప్పు యాదవ్ ద్వారా రూ. 15 లక్షలకు ఒప్పందం కుదుర్చుకుందని తెలిపారు. పైగా తనకు సెక్యూరిటీ కల్పించామని, తను చెప్పేదంతా అబద్ధమని వెల్లడించారు.






