ఈ ఏడాది ఎగుమతుల లక్ష్యాన్ని సాధించగలం : పీయూష్ గోయెల్

by  |
ఈ ఏడాది ఎగుమతుల లక్ష్యాన్ని సాధించగలం : పీయూష్ గోయెల్
X

దిశ, వెబ్‌డెస్క్: గత నెలలో ఎగుమతులు గణనీయంగా పెరగడంతో ఈ ఏడాది రూ. 29.3 లక్షల కోట్ల సరుకుల ఎగుమతుల లక్ష్యాన్ని సాధించగలమనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్టు వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయుష్ గోయెల్ మంగళవారం చెప్పారు. ఎగుమతి ప్రమోషన్ కౌన్సిల్ సమావేశంలో మాట్లాడిన ఆయన..ఈ ఏడాది ఫార్మా, ఇంజనీరింగ్, ఆటో-కాంపోనెంట్, ఫిషరీస్, వ్యవసాయ ఉత్పత్తుల వంటి అనేక రంగాల్లో ఎగుమతులను పెంచే అవకాశం ఉందన్నారు.

ఏప్రిల్‌లో భారత వాణిజ్య ఎగుమతులు 197 శాతం పెరిగి రూ. 2.21 లక్షల కోట్లకు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ వృద్ధి ప్రస్తుత ఏడాది ఎగుమతుల లక్ష్యం రూ. 29.3 లక్షల కోట్లను సాధించగలమనే నమ్మకం కలుగుతోందన్నారు. విద్యుత్ ఛార్జీలపై సుంకం, రవాణాలో ఇంధనంపై వ్యాట్, ఎక్సైజ్ సుంకం, వ్యవసాయ రంగం, స్టాంప్ డ్యూటీ వంటి పన్నుల రీయంబర్స్‌మెంట్ భారత ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్లో పోటీగా నిలిచేందుకు వీలవుతుందని పీయూష్ గోయెల్ తెలిపారు.


Next Story

Most Viewed