- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తండ్రియిన అంబటి రాయుడు
<p>దిశ, స్పోర్ట్స్: టీమ్‌ఇండియా సీనియర్ క్రికెటర్, హైదరాబాద్ జట్టు సభ్యుడు అంబటి రాయుడు తండ్రయ్యాడు. తన వ్యక్తిగత విషయాలను ఎప్పుడూ బయటకు పంచుకోని రాయుడు, తన భార్య విద్య పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చిన విషయాన్ని మాత్రం వెల్లడించాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున రాయుడు ఆడుతుండటంతో ఈ విషయాన్ని సీఎస్కే తమ అధికారిక సోషల్ మీడియాలో వెల్లడించింది. ‘డాడీస్ ఆర్మ నుంచి మైదానం బయట నేర్చుకున్న పాఠాలను ఇప్పుడు ఉపయోగించాలి మరి’ అంటూ సీఎస్కే […]</p>

దిశ, స్పోర్ట్స్: టీమ్‌ఇండియా సీనియర్ క్రికెటర్, హైదరాబాద్ జట్టు సభ్యుడు అంబటి రాయుడు తండ్రయ్యాడు. తన వ్యక్తిగత విషయాలను ఎప్పుడూ బయటకు పంచుకోని రాయుడు, తన భార్య విద్య పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చిన విషయాన్ని మాత్రం వెల్లడించాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున రాయుడు ఆడుతుండటంతో ఈ విషయాన్ని సీఎస్కే తమ అధికారిక సోషల్ మీడియాలో వెల్లడించింది. ‘డాడీస్ ఆర్మ నుంచి మైదానం బయట నేర్చుకున్న పాఠాలను ఇప్పుడు ఉపయోగించాలి మరి’ అంటూ సీఎస్కే జట్టు మెసేజ్ చేసింది. ఇక జట్టు సహచరుడైన సురేష్ రైనా కూడా అంబటి రాయుడికి అభినందనలు తెలిపాడు. ‘చక్కని బిడ్డకు జన్మనిచ్చిన విద్య, రాయుడికి హృదయపూర్వక అభినందనలు. ఆ చిట్టితల్లితో ప్రతీక్షణం ఆనందించడం అదొక అద్భుత ఆశీర్వాదం.’ అని ట్వీట్ చేశాడు. గత ఏడాది వరల్డ్ కప్‌కు ఎంపిక చేయనందుకు నిరసనగా క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన రాయుడు ఆ తర్వాత తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు.






