పాడ్‌కాస్ట్ లాంచ్ చేసిన అమెజాన్

by  |
పాడ్‌కాస్ట్ లాంచ్ చేసిన అమెజాన్
X

దిశ, ఫీచర్స్ : ‘పాడ్‌కాస్ట్’‌‌లకు ఇప్పుడిప్పుడే ఆదరణ పెరుగుతోంది. ప్రైస్‌ వాటర్‌హౌస్‌ కూపర్స్ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఔట్‌లుక్ 2020 నివేదిక ప్రకారం.. చైనా, యూఎస్ తర్వాత 57.6 మిలియన్ల నెలవారీ శ్రోతలతో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద పాడ్‌కాస్ట్ లిజనింగ్ మార్కెట్‌గా భారత్ అవతరించింది. ఈ నేపథ్యంలో అమెజాన్ ప్రైమ్ మ్యూజిక్ ఇండియాలో పాడ్‌కాస్ట్‌లను ప్రారంభిస్తున్నట్లు అమెజాన్ సంస్థ బుధవారం ప్రకటించింది. ఈ మేరకు ప్రైమ్ మ్యూజిక్ యాప్‌లో ఎలాంటి అడిషనల్ మనీ లేకుండా అమెజాన్ ప్రైమ్ సభ్యులందరికీ పాడ్‌కాస్ట్‌లు అందుబాటులో ఉండనున్నాయి. గతేడాది సెప్టెంబరులోనే అమెజాన్ తన మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లో పాడ్‌కాస్ట్‌లను ప్రారంభించగా, తాజాగా ఇండియాలోనూ ఆ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఈ మేరకు ఇండియాలోని అమెజాన్ ప్రైమ్ మ్యూజిక్ సభ్యులు 90 మిలియన్లకు పైగా పాడ్‌కాస్ట్ ఎపిసోడ్లకు యాక్సెస్ అయ్యే అవకాశం దక్కింది. కాగా ‘ఆన్ పర్పస్ విత్ జే శెట్టి, టెడ్ టాక్స్ డైలీ, రాబిన్ శర్మ రచించిన ‘ది డైలీ మాస్టరీ’ పాడ్‌కాస్ట్ సహా సైరస్ బ్రోచా, నీల్ భట్, సద్గురు, అనుపమ్ గుప్తాతో పాటు ఎంతోమంది క్రియేటర్స్ నుంచి అనేక లోకల్ షోస్‌తో పాటు మోటివేషన్, బిజినెస్, టెక్నాలజీ, కామెడీ, సంగీతం, ఫిట్‌నెస్ అంశాలకు సంబంధించిన భిన్నమైన పాడ్‌కాస్ట్ ఎపిసోడ్‌లు అమెజాన్‌లో అందుబాటులో ఉన్నాయి.

ఇక అమెజాన్ అలెక్సాకు కూడా పాడ్‌కాస్ట్‌లు సపోర్ట్ చేస్తుంటాయి. దీంతో వినియోగదారులు ‘అలెక్సా.. జే శెట్టితో పర్పస్ ప్లే లేదా అలెక్సా.. టెడ్ టాక్స్ డైలీ‌లోని గత వారం ఎపిసోడ్ ప్లే చెయ్’ అని అడిగితే సరి, అదే వెతికిపెడుతుంది. ఆండ్రాయిడ్, ఐవోఎస్, వెబ్ బ్రౌజర్, అమెజాన్ ఎకో పరికరాల్లోని అమెజాన్ ప్రైమ్ మ్యూజిక్ యాప్‌లో పాడ్‌కాస్ట్‌లను స్ట్రీమ్ చేయొచ్చు, కావాలనుకుంటే డౌన్‌లోడ్ కూడా చేసుకోవచ్చు. ఈ క్రమంలో 2023 నాటికి భారత పాడ్‌కాస్ట్ మార్కెట్ విలువ రూ. 17.62 కోట్లుగా ఉండొచ్చని అంచనా.


Next Story

Most Viewed