ఫుడ్ ఆర్డర్ల కోసం చెట్టుకు వేలాడుతున్న సెల్‌ఫోన్లు

by  |
ఫుడ్ ఆర్డర్ల కోసం చెట్టుకు వేలాడుతున్న సెల్‌ఫోన్లు
X

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా లాక్‌డౌన్ వల్ల వ్యాపారాలు మూతపడి చాలా మంది ఆర్థిక కష్టాలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం లాక్‌‌డౌన్ ఎత్తేయడంతో.. ఆర్థిక లోటును పూడ్చుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. నాలుగు రాళ్లు సంపాదించుకునేందుకు మళ్లీ ఉరుకులు పరుగుల జీవితానికి అలవాటు పడుతున్నారు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణే.. అమెరికా, చికాగోలోని అమెజాన్ డ్రైవర్ల పరిస్థితి. అక్కడి అమెజాన్ డెలివరీ స్టేషన్స్, హోల్ ఫుడ్ స్టోర్ల వద్ద ఆర్డర్ల కోసం తమ సెల్‌ఫోన్లను చెట్టుకు వేలాడదీసి.. చకోర పక్షుల్లా ఎదురు చూస్తున్నారు.

మనం ఫుడ్ ఆర్డర్ పెట్టాలన్నా, క్యాబ్ బుక్ చేయాలన్నా.. ముందుగా మన ఫోన్‌లో లొకేషన్ ఆన్ చేయాలి. మనకు లొకేషన్‌కు దగ్గరలో ఏ క్యాబ్ డ్రైవర్ ఉన్నాడో, ఏ ఫుడ్ డెలివరీ బాయ్ ఉన్నాడో.. వారి నెంబర్లను మనకు సూచిస్తుంటుంది. సో.. అందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని మన ప్రాసెస్ కంటిన్యూ చేస్తాం. సేమ్ ఇక్కడ కూడా అదే జరుగుతోంది. కానీ చికాగోలోని అమెజాన్ డ్రైవర్లు.. అమెజాన్ ఫుడ్ స్టోర్లు, హోల్ ఫుడ్ స్టోర్లకు అతి దగ్గరలో ఉన్న చెట్లకు ఫోన్లను వేలాడదీస్తున్నారు. అమెజాన్.. సిస్టమ్ దగ్గరలోని డ్రైవర్లను ఎంపిక చేయడంతో ముందుగా వారికే ఆర్డర్ వెళ్తుంటుంది. ఇలా డ్రైవర్ల మధ్య బోలెడు కాంపిటీషన్ పెరిగింది. ఇదంతా ఎందుకంటే.. రోజులో వాళ్లు డెలివరీ చేసిన ఆర్డర్ల ప్రకారమే వారికి ఇన్సెంటివ్స్, టిప్స్ ఎక్కువగా వస్తాయి. కాగా ఈ ఐడియాను ఫాలో అవుతున్న డ్రైవర్ల పరిస్థితి ఎంతో కొంత మెరుగ్గా ఉండగా.. మిగతా డ్రైవర్లకు మాత్రం అసలే ఆర్డర్లు రావడం లేదని వాపోతుండటం గమనార్హం. అమెజాన్ కంపెనీకి ఈ వ్యవహారం గురించి తెలిసినా, ఇప్పటికైతే ఈ విషయంలో స్పందించలేదు.



Next Story

Most Viewed