- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘అమరం అఖిలం ప్రేమ’కు కింగ్ విషెస్
<p>దిశ, వెబ్‌డెస్క్: ‘ప్రేమించడం అంటే ప్రేమిస్తూనే ఉండటం’ అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ‘ఆహా’ ఒరిజినల్ మూవీ ‘అమరం అఖిలం ప్రేమ’. పాపను దత్తత తీసుకుని ప్రాణంగా పెంచుకున్న తండ్రి, కూతుళ్ల బంధం ఒక వైపు.. కూతురిని ప్రేమించే వ్యక్తి అనుబంధం మరోవైపు.. ఇందులో బిడ్డకు ఏది దక్కాలి? బిడ్డ ప్రేమను అంగీకరించకుండా తనతో మాట్లాడటం మానేసిన తండ్రి చివరికి అర్థం చేసుకున్నాడా? కూతురిగా ఉండే అర్హత లేదనే పెళ్లికి ఒప్పుకున్నాడా? కణ్వ మహర్షి, శకుంతలా దేవి కథను […]</p>

దిశ, వెబ్‌డెస్క్: ‘ప్రేమించడం అంటే ప్రేమిస్తూనే ఉండటం’ అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ‘ఆహా’ ఒరిజినల్ మూవీ ‘అమరం అఖిలం ప్రేమ’. పాపను దత్తత తీసుకుని ప్రాణంగా పెంచుకున్న తండ్రి, కూతుళ్ల బంధం ఒక వైపు.. కూతురిని ప్రేమించే వ్యక్తి అనుబంధం మరోవైపు.. ఇందులో బిడ్డకు ఏది దక్కాలి? బిడ్డ ప్రేమను అంగీకరించకుండా తనతో మాట్లాడటం మానేసిన తండ్రి చివరికి అర్థం చేసుకున్నాడా? కూతురిగా ఉండే అర్హత లేదనే పెళ్లికి ఒప్పుకున్నాడా? కణ్వ మహర్షి, శకుంతలా దేవి కథను పోలిన ఈ కథ ఎలా ఉండబోతుంది.
https://twitter.com/iamnagarjuna/status/1301440787356418048?s=20
జోనాథన్ ఎడ్వర్డ్స్ దర్శకత్వం వహించిన ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ చేసిన కింగ్ నాగార్జున.. మూవీ యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. సినిమా కాన్సెప్ట్ బాగుందని కాంప్లిమెంట్స్ అందించారు. విజయ్ రామ్, శివశక్తి సచ్ దేవ్, నరేశ్ ప్రధానపాత్రల్లో తెరకెక్కిన చిత్రం ట్రైలర్‌కు మంచి మార్కులే పడ్డాయ్. కాగా సినిమా సెప్టెంబర్ 18న ‘ఆహా’లో రిలీజ్ కాబోతుంది.






