మలయాళీ మగువ.. బికినీ అందాలు వైరల్‌

by  |
మలయాళీ మగువ.. బికినీ అందాలు వైరల్‌
X

దిశ, సినిమా: మలయాళీ బ్యూటీ అమలాపాల్ బికినీ ఫొటోలు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి. సముద్రతీరాన చెక్కిన శిల్పంలా నిలబడి ఉన్న అమల తన స్కిన్ షోతో ఏంజెల్‌ను తలపిస్తోంది. ఈ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన హీరోయిన్.. జీవితంలో యాక్సెప్టెన్స్, మహిళల సామర్థ్యాలపై లాంగ్ నోట్ యాడ్ చేసింది. దేవత అంటే ఎవరు? అని మొదలుపెట్టిన భామ.. ‘మనసు, శరీరం, ఆత్మ ద్వారా అన్ని స్థాయిల్లో తనను తాను తెలుసుకోవడం, అంగీకరించడంతోపాటు ప్రేమించడాన్ని నేర్చుకునే ప్రక్రియలో ఉన్న అతివ. వ్యక్తిగత ఎదుగుదల, స్వీయ-అవగాహనపై దృష్టి సారించినందున శాంతి, ప్రేమ, ఆనందం, అభిరుచి, వినోదంతో నిండిన జీవితాన్ని అనుభవించే మహిళ. తన జీవితాన్ని కోరుకున్న విధంగా మలచుకునే అపరిమిత సామర్థ్యం తనకుందని అర్థం చేసుకున్న స్త్రీ. కృతజ్ఞతా భావం, మనోధైర్యంతో తన చుట్టూ ఉన్నవారికి ఇవ్వడానికి ప్రేరణ పొందిన వనిత’ అంటూ పలువిధాలుగా నిర్వచించింది.

ఇక అద్భుతమైన స్విమ్‌సూట్‌లో నెటిజన్ల మనసు దోచుకున్న పిక్చర్స్‌పై ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. చివరగా ‘పిట్ట కథలు’ అనే నెట్‌ఫ్లిక్స్ ఆంథాలజీ కనిపించిన అమల.. ప్రస్తుతం ‘అధో అంధ పరవై పోలా2 (తమిళ్), ఆడుజీవితం(మలయాళం) చిత్రాలతో బిజీగా ఉంది.



Next Story