14ఏళ్ల కోరిక .. అల్లు శిరీష్ పోస్ట్ వైరల్

by  |
Allu sirish
X

దిశ, సినిమా: కరోనా కారణంగా సినిమాలకు దూరమైన నటులు, నటీమణులు ఇప్పుడిప్పుడే జోరు పెంచుతున్నారు. ఈ క్రమంలోనే అల్లు వారి అబ్బాయి అల్లు శిరీష్ ‘ప్రేమ కాదంటా’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. అయితే సినిమాలతో పాటు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే అల్లు శిరీష్.. తాజాగా తన ట్విట్టర్ ఖాతాలో ఓ హిందీ సినిమాకు సంబంధించి ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశాడు.

బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘జెర్సీ’ మూవీ విడుదలకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే ముంబైలోని రోడ్డు పక్కన ‘జెర్సీ’ మూవీ హోర్డింగ్‏లో అల్లు ఎంటర్‏టైన్మెంట్స్ అని ఉండటం చూసి ఎమోషనల్ అయిన ఈ యంగ్ హీరో.. ‘జూహు సర్కిల్‌లోని హోర్డింగ్‌లో అల్లు ఎంటర్‏టైన్మెంట్స్ అని చూడాలని పద్నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్నా.. మొత్తానికి ఈ సినిమాతో నా కోరిక నెరవేరింది’ అని తెలిపాడు.

రైల్వే కంపార్ట్‌మెంట్స్ మాదిరిగానే థియేటర్లోనూ.. జగన్ సర్కార్‌పై హీరో నిఖిల్ రియాక్షన్

Next Story