మాలీవుడ్‌లో అల్లు అర్జున్‌కు సరిపోయేది అతడే..

by  |
మాలీవుడ్‌లో అల్లు అర్జున్‌కు సరిపోయేది అతడే..
X

దిశ, సినిమా : సోషల్ మీడియాలో ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన సినిమాలు మల్టిపుల్ లాంగ్వేజెస్‌లో డబ్ అవుతుండటంతో ఇండియా వైడ్‌గా‌నే కాక ఇతర సౌత్ ఏషియన్ కంట్రీస్‌లోనూ పాపులారిటీ సొంతం చేసుకున్నాడు బన్నీ. ఇక సౌత్ ఇండియాలో టాలీవుడ్ సంగతి పక్కనబెడితే, కేరళలో తనకున్న ఫ్యాన్ చేస్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. కాగా సోమవారం ‘మీరు ఏ మల్లూ యాక్టర్‌?’ అనే క్విజ్‌లో అల్లు అర్జున్ ప్రతీ ఒక్కరిని సర్‌ప్రైజ్ చేశాడు. దీనిపై అతడి రియాక్షన్ కూడా మైండ్‌బ్లోయింగ్‌గా ఉండటం విశేషం.

ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ క్విజ్ ట్రై చేసిన బన్నీ.. మాలీవుడ్ యాక్టర్స్‌లో తనలాగే ఎవరుంటారో కనుగొన్నాడు. మోహన్ లాల్, మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్ తదితరులను డిస్‌ప్లే చేసిన ఫిల్టర్.. చివరకు కుంచకో బోబన్‌ ఫొటోను చూపెట్టింది. ఈ ఆన్సర్‌తో హ్యాపీగా ఫీలైన స్టైలిష్ స్టార్.. నవ్వుతూ థమ్స్ అప్ సింబల్ చూపించాడు. ఇదే వీడియోను ట్విట్టర్‌లో పోస్టు చేసి ‘ఫన్ స్టఫ్’ అనే క్యాప్షన్ ఇవ్వగా, ఫ్యాన్స్ రియాక్షన్స్‌తో ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. కాగా మలయాళ ఇండస్ట్రీ యాక్టర్స్‌లో బోబన్ ఒకరు.


Next Story

Most Viewed